Ads
శాంతి ప్రియ అంటే భానుప్రియ చెల్లెలుగా తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితమే. ఆమె తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. ఆమె ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.
Video Advertisement
శాంతిప్రియను బాలీవుడ్ నటిగా ఎక్కువగా పాపులర్ అయ్యారు. బాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకుంది. వివాహం అయిన తరువాత నటనకు దూరంగా ఉన్నారు. తాజాగా శాంతిప్రియ మొదటిసారి తన భర్త ఎలా చనిపోయారో వెల్లడించారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
శాంతిప్రియ 1987లో తమిళ చిత్రం ‘ఎంగ ఊరు పట్టుకారన్’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. భానుప్రియ స్టార్ హీరోయిన్ గా చేసిన దర్శకుడు వంశీ శాంతి ప్రియని ‘మహర్షి’ అనే చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు. తెలుగులో ఇదే ఆమెకు మొదటి చిత్రం. ఆయన తీసిన మహర్షి సినిమా అంతగా ఆడకపోయినా, ఆ సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయి. శాంతి ప్రియ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో ఆమె తమిళ సినిమాల్లోను ఆ తరువాత ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ పొందింది. దాంతో ఆమెను హిందీ నటిగానే పరిగణిస్తారు. శాంతి ప్రియ ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన వి శాంతారామ్ మనవడు సిద్ధార్థ్ రేను ప్రేమించి 1992లో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ కూడా బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించాడు. ఈ జంటకి ఇద్దరు కుమారులు. అయితే పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో శాంతి, సిద్ధార్థ్‌ల మధ్య గొడవలు జరిగేవని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.
శాంతి ప్రియ మాట్లాడుతూ భర్త చనిపోయే ముందు కూడా మాకు చాలా గొడవలు జరిగాయని, అప్పటికి పెద్ద అబ్బాయి వయసు 10 ఏళ్లు, చిన్న బాబు వయసు 4 ఏళ్లు. తన భర్త చనిపోయే కూడా ఇద్దరికీ గొడవ జరిగిందని, ఒక విషయం మాట్లాడాలని పిలవగా, తను వెళ్లలేదని, ఆ తరువాత భోజన సమయంలో తింటూ ఉండగానే వెనక్కి పడి మరణించారని తెలిపారు. సిద్ధార్థ్ మరణం తర్వాత మళ్ళీ తన పిల్లల కోసం నటించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె చాలా హిందీ సీరియల్స్‌లో నటిస్తూ, తన పిల్లలను పెంచింది.
watch video :
https://www.instagram.com/reel/CraJRMko23L/?igshid=NTc4MTIwNjQ2YQ==
Also Read: 5 కోట్లు పెట్టి తీసిన సినిమా… 50 కోట్లు తెచ్చిపెట్టింది..! అంతలా ఏం ఉంది..?
End of Article