Ads
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వారు నటనని కంటిన్యూ చేస్తూ హీరోలుగా, హీరోయిన్లుగా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోవడం ఇండస్ట్రీలో పరిపాటి.. ఆ కోవకి చెందినవాడే మాస్టర్ భరత్.. సారీ ఇప్పుడు మనోడు మాస్టర్ కాదు కదా..భరత్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయి ఇప్పుడు హీరో ఫ్రెండ్ రోల్స్ పోషిస్తూ తన నటనతో మెప్పిస్తున్నాడు..ఇటీవల చిత్రసీమలో తన అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు శేర్ చేసుకున్నాడు భరత్..
Video Advertisement
అనగనగా ఒక పేద కుటుంబం..ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు..తల్లి కూడా పేదదే..పిల్లలు,తోటమాలి ఆఖరికి వంటవాడు కూడా పేదవాడే..వాళ్లు తినడానికి చికెన్ బిర్యాని దొరక్క ఎసి కార్లో వెళ్తుంటే…పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఆనందమానందమాయే మూవీలోని ఫన్నీ సీన్ ఇప్పటికి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది..ఆ సీన్లో నటించిన మాస్టర్ భరత్ తర్వాత రెడీ, ఢీ, కింగ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు.రెడీ, బిందాస్లో తన కామెడికి గాను నంది అవార్డులు కూడా అందుకున్నాడు.
ఢీ లో మంచు విష్ణు – భరత్ కాంబినేషన్లో వచ్చిన ఫన్నీ సీన్స్ ఇప్పటికి మర్చిపోలేం.. మంచు వారి ఫ్యామిలితో భరత్ ది ప్రత్యేక అనుబంధం ..ఢీ, బిందాస్, దేనికైనా రెడీ,సలీమ్, ఆచార్య అమెరికా యాత్రా ఇలా మంచు సోదరులతో భరత్ వారి చిత్రాల్లో నటించాడు.. ఇక ఇండస్ట్రీలో మోహన్ బాబుకి ఉన్న పలుకుబడి తెలిసిందే, చాలామంది ఆయన ముందు నిలబడి మాట్లాడానికి భయపడతరాంటరు..అలాగే భరత్ కూడా మోహన్ బాబుకి ఒకసారి భయపడి ఏడ్చాడట..
విష్ణు-ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన సలీం షూటింగ్ అప్పుడు భరత్ దగ్గరకి వచ్చిన మోహన్ బాబు..ఏంట్రా ఎక్కువ చేస్తున్నావట? పొగరెక్కిందా ??? అని అడిగేసరికి భరత్ వెంటనే ఏడ్చేసాడట.. అప్పుడు కొంచెం దూరంలో ఉన్న విష్ణు వచ్చి నాన్న, ఏం అనొద్దు చాలా మంచోడు అని చెప్తే..నేనేం అనట్లేదురా, జస్ట్ జోక్ చేసా అని మోహన్ బాబు అనగానే స్పాట్లో ఉన్నవాళ్లంతా ఒకేసారి నవ్వుతున్నా కూడా భరత్ అదే షాక్లో ఉండిపోయాడట..తన కొడుకులతో పాటుగా నన్ను చూస్తారు,బాగా ఎంకరేజ్ చేసేవారు అని మోహన్ బాబుతో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నాడు భరత్.
End of Article