ఒకప్పుడు అనాగరికత కారణంగా మన భారతదేశంలో వంటింటికే పరిమితమైన ఆడవారిని గురజాడ అప్పారావు లాంటి సంఘ సంస్కర్తల పుణ్యమా అంటూ ఆడవారికి కాస్త స్వేచ్ఛ లభించింది.ఒక అమ్మ గా ,భార్య గా ,చెల్లి గా ఇలా పలు గొప్ప పాత్రలను పోస్తున్న ఆడవారు ఇప్పడి సమాజంలో మగవారి కంటే కూడా అన్ని రంగాలలోను ముందు ఉంటూ ఎంతో ప్రగతిని అన్ని రంగాలలోను సాధిస్తున్నారు.అయితే ఇంత అభివృద్ధి చెందిన నేటి సమాజంలోనూ ఆడవారి ఆత్మభిమానాన్ని దెబ్బతీసే సంఘటనలు కొన్ని ప్రాంతాలలో నేటికీ జరుగుతుండడం అమానుషం.

Video Advertisement

మధ్యప్రదేశ్ లో భార్యలను అద్దెకి ఇచ్చే ఆచారం నేటికీ కొనసాగుతుంది.కాగా ఇప్పుడు ఈ విషయం తెరమీదకు వచ్చి అంతటా ఈ వార్త వైరల్ గా మారింది . ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రముఖ వెబ్ సైట్ కధనం ప్రకారం …మధ్యప్రదేశ్ లోని శివపురి గ్రామంలో దధిచా సంప్రదాయం ప్రకారం భార్యలను అద్దెకిచ్చే సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది.భార్యలు లేని కొంతమంది డబ్బున్న వారు ఈ గ్రామానికి విచ్చేసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక సంవత్సరానికి గాను అగ్రిమెంట్ రాసుకుని వేరే వారి భార్యలను ఒక సంవత్సరానికి అద్దెకు తీసుకుంటారు.ఒకవేళ అంతా బాగుంది అని వారు అనుకుంటే ఈ అగ్రిమెంట్ ను పొడిగించుకుంటారు.

భార్యను అద్దెకు తీసుకున్నందుకు గాను నెలకు ఒక వెయ్యి రూపాయల నుండి లక్ష రూపాయల వరకు చెల్లిస్తారు అంట..ఈ వ్యవహారం మొత్తానికి స్థానికంగా ఉండే వారే పెద్ద మనుషులుగా మారి మధ్యవర్తులుగా ఉంటారు.ఇంతగా అభివృద్ధి చెందిన భారత దేశంలో నేటికీ ఇలాంటి ఆచారాలు కొనసాగడం దారుణం అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.