Ads
నేటి ఫాస్ట్ యుగంలో చదువులకు ఉన్న ప్రాముఖ్యత అందులోనూ ర్యాంకులకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. అయితే చాలామంది చదువులో వెనకబడుతూ ర్యాంకులు సాధించలేక ఆత్మ న్యూనత కు బాధపడుతూ ఉంటారు.అయితే భీమవరంలో ఉన్న ఈ గుడికి వెళ్తే చదువులో రాణిస్తారని అక్కడ వాళ్ళందరికీ చాలా నమ్మకం. అయితే ఆ గుడి ఎవరిది, దాని కధేమిటో ఒకసారి చూద్దాం.
Video Advertisement
ఇప్పుడు మనం చెప్పుకునే గుడి మావుళ్ళమ్మ అమ్మవారి గుడి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో కొలువై ఉంది ఈ తల్లి 9 దశాబ్దాల క్రితం వెలసిన అమ్మవారు. శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతుంది. 1880 లలో వైశాఖమాసం రోజుల్లో భీమవరంలో అమ్మవారి వెలిశారని చరిత్ర చెబుతుంది.గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించే తాను వెలసిన ప్రాంతాన్ని చెప్పారని,ఆ తర్వాత అమ్మ చెప్పిన ప్రాంతం లో వెతకగా అమ్మవారి విగ్రహం లభ్యమైందని, అమ్మవారి విగ్రహం ఉన్నచోట దీపాలు వెలుగుతూ కనిపించాయి.
అమ్మ ఆదేశం మేరకు అక్కడే చిన్న పాక వేసి ఆలయాన్ని నెలకొల్పారు. మామిడి తోటలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అమ్మవారు వెలసింది కాబట్టి తొలినాళ్లలో మావిళ్లమ్మగా పిలిచేవారని, వాడుకలో అది కాస్త మావుళ్ళమ్మగా మారింది. అమ్మవారికి దసరా సమయంలో ఒకసారి, సంక్రాంతి సమయంలో ఒకసారి జాతరలు వేరువేరుగా జరుగుతాయి. ఉత్సవాల చివరి రోజున సుమారు లక్ష మందికి అన్న ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే బాగా చదవని పిల్లల సైతం బాగా చదువుతారని అక్కడ ప్రజల నమ్మకం .
జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. జేష్ఠ మాసంలో నెలరోజుల పాటు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకు ఒక అవతారంలో అలంకరిస్తారు. ప్రతిరోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం తదితర పూజలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారిని భీమవరం నుంచే కాక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
End of Article