Ads
2016లో ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు, తమిళంలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే ‘బిచ్చగాడు’. దీనికి ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘బిచ్చగాడు 2’. హిట్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
Video Advertisement
అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ తాజాగా టార్గెట్‌ను ఫినీష్ చేసింది. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు.
పర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని కూడా ఇచ్చాడు. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని జరుపుకుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఈ మూవీ తెలుగులో రూ. 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ లక్ష్యాన్ని చేరుకున్న ఈ సినిమా అదనంగా రూ. 75 లక్షలు ప్రాఫిట్ అందుకుని తెలుగులో హిట్ గా నిలిచింది. తమిళంలో మళ్ళీ అంత హవా లేదు. అలా అని అక్కడి కూడా నష్టాలు ఏమీ రాలేదు. తెలుగులో అయితే లాభాలు కాస్త ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ‘బిచ్చగాడు 3 ‘ కూడా తీయడానికి విజయ్ ఆంటోనీ రెడీ అయిపోయాడు.
విజయ్ గురుమూర్తి, సత్యగా డిఫరెంట్ షేడ్స్‌తోకూడిన క్యారెక్టర్‌లో విజయ్ ఆంటోనీ నటన బాగుంది. పాజిటివ్, నెగెటివ్ షేడ్స్‌తో సాగే పాత్రలో అదరగొట్టాడు. అతడి క్యారెక్టర్ చుట్టే ఈ సినిమా సాగుతుంది. హీరోగానే కాకుండా దర్శకుడిగా ఫస్ట్ సినిమానే మంచి మార్కులు కొట్టేసాడు.
పేరుకే సీక్వెల్ గానీ రెండు కథలకు పెద్దగా సంబంధం ఉండదు. బిచ్చగాడు సెంటిమెంట్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే సీక్వెల్ మాత్రం బ్రెయిన్ మార్పిడి అనే ప్రయోగాత్మక పాయింట్‌కు యాక్షన్ అంశాలను జోడించి నడిపించారు. చివరి వరకు కథను ఉత్కంఠభరితంగా నడిపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు విజయ్ ఆంటోనీ.
Also read: ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ లో “ఊర్వశి రౌతేలా” ధరించిన నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
End of Article