ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. మొదటివారం ఎలిమినేషన్ అయ్యాక ఆట మరింత ఆసక్తికరం గా సాగుతోంది.

bigboss

తాజాగా విడుదల అయినా ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ మరింత గట్టిగానే కొట్టుకున్నారని తెలుస్తోంది. ఓ పక్కన షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేస్తుంటే మరో వైపు.. విమెన్ కార్డు వాడొద్దంటూ శ్రీ రామ చంద్ర కాజల్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటె రవి కి, విశ్వ కి మధ్య కూడా ఫైట్ అయిందని అర్ధమవుతోంది. రవి ఏకం గా ఛీ అంటూ విశ్వ పై విసుక్కున్నాడు. విశ్వ కూడా తగ్గేదిలేదు అన్నట్లు టాస్క్ ఆడుతున్నాడు. వీరిద్దరూ ఎందుకు ఫైర్ అయ్యారో తెలియాలంటే బిగ్ బాస్ షో చూడాల్సిందే.