ప్రతి ఏడాది బిగ్ బాస్ సీజన్ అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది మాత్రం కరోనా కారణం గా ఈ సీజన్ ఆలస్యం గా మొదలైయింది. కరోనా కారణం గా పలు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఈ సీజన్ ను షూట్ చేసారు. తాజాగా.. ఈ ఏడాది కూడా ఈ షో ను టెలికాస్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమం లో బిగ్ బాస్ సీజన్ 5 లో ఉండబోయే కంటెస్టెంట్ల గురించి కూడా వార్తలు హల్ చల్ అవుతున్నాయి.

big-boss-season-5-telugu

big-boss-season-5-telugu

ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల లిస్ట్ కూడా వైరల్ కూడా అయింది. సెప్టెంబర్‌ 5న సాయంత్రం 6 గంటల సమయం లో బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమం లోనే కంటెస్టెంట్ లను హైదరాబాద్ లోనే ఓ హోటల్ లో క్వారంటైన్ చేసారని సమాచారం. అయితే.. వీరిలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ గా తేలిందట. పేర్లు బయటకు రాలేదు. ఈ క్రమం లో ఈ కార్యక్రమం అనుకున్న విధంగానే టెలికాస్ట్ అవుతుందా..? లేక పోస్ట్ పోన్ అవుతుందా? అన్న చర్చలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో మార్పులు..? ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే..??

మొదటి రోజు ఎంట్రీ ఇవ్వబోతున్న లిస్ట్ ఇదే అంటూ నెట్లో ఇప్పటికే చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకు అసలు చెక్ పడేది మాత్రం బిగ్ బాస్ మొదలైన రోజే..యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, యాంకర్ లోబో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, సీరియల్ నటి ఉమా దేవి, VJ సన్నీ, యూట్యూబ్ సరయు, లహరి శారీ, ప్రియాంక జబర్దస్త్, అనీ మాస్టర్, RJ కాజల్, మానస్, ఆటా సందీప్, నటరాజ్ మాస్టర్, సిరి హన్మంత్, షణ్ముఖ్ లు కాగా..ఫైనల్ చేరే వారి లిస్ట్ కూడా సిద్ధం చేసారంట నిర్వాహకులు.

లిస్ట్ లోని ఏడుగురు సభ్యులు మాత్రమే ఫైనల్స్ కి వెళ్ళేలాగా ప్లానింగ్ చేశారట. ఎందుకంటే వారికి బయట ఉన్న కమిట్మెంట్స్ బాధ్యతలు దృష్ట్యా ఇలా మార్పులు చేసారని తెలుస్తుంది. వీరికి భారీగానే రెమ్యూనరేషన్ ని మూట గడుతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అధికారికంగా ఇంకా వెలువడలేదు.

ఇవి కూడా చదవండి: “బిగ్ బాస్ 5” లో పాల్గొనే 17 మంది కంటెస్టెంట్స్ వీళ్ళేనా..? లిస్ట్ ఒక లుక్కేయండి.!