ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో మానస్ నాగులపల్లి కూడా ఉన్నారు.

manas 1

మానస్ నాగులపల్లి విశాఖ పట్టణం లోనే జన్మించారు. ఆ తరువాత మానస్ కుటుంబం ముంబై కి షిఫ్ట్ అయ్యింది. అక్కడే మానస్ కు డాన్స్, సినిమా లపై ఆసక్తి పెరిగింది. అతని తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మరియు తల్లి మహిళలు మరియు పిల్లల హక్కుల కార్యకర్త, మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) లోను సభ్యులు గా పని చేసారు. ముంబై నుంచి తిరిగి వైజాగ్ కు వచ్చేసారు. ఆ తరువాత మానస్ కుటుంబం హైదరాబాద్ లోనే స్థిరపడింది.

manas 2

మానస్ హైదరాబాదులోని గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో తన B. టెక్ పూర్తి చేసారు. అందరు కుర్రాళ్ళ లాగే మానవ పవన్ కు వీరాభిమాని. డాన్స్ విషయం లో మెగాస్టార్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. 2001 తెలుగు సినిమా నరసింహ నాయుడుతో బాల నటుడిగా మానస్ తన కెరీర్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు గాను మానస్ నంది అవార్డును కూడా గెల్చుకున్నారు. ఝలక్ లో హీరో గా నటించిన మానస్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడా, గోలి సోడా వంటి ఇతర చిత్రాలలో కూడా నటించారు.