యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

by Anudeep

Ads

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో సిరి హనుమంత్ కూడా ఉన్నారు.

Video Advertisement

siri hanumanth 1

యు ట్యూబ్ స్టార్ గా సిరి హనుమంత్ అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ డాన్స్ తోనే సిరి అదరగొట్టేసారు. బిగ్ బాస్ లోకి రాకముందే సిరి షార్ట్ ఫిలిమ్స్ తోనూ, వెబ్ సిరీస్ లతోను ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. స్టేజిపైనే నవరసాలు పలికించి అందరిని ఎంటర్టైన్ చేసింది. తనకు ఇష్టమైనవి రెండే రెండు అంటూ సిరి చెప్పుకొచ్చింది. ఒకటి నిద్ర, రెండు మంచి నిద్ర అంటూ అసలు సంగతి చెప్పి నవ్వేసింది.

siri hanumanth 2

మంచి భర్త ఎలా ఉండాలి అనుకుంటోందో కూడా సిరి చెప్పుకొచ్చింది. తన దృష్టి లో మంచి భర్త అంటే ఎక్కువ అర్ధం చేసుకోవాలట.. ఎక్కువ గా గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలట. స్టార్ మా లో “ఉయ్యాలా జంపాల” సీరియల్ తో ఇండస్ట్రీ లో సిరి ప్రయాణం మొదలైంది. వైజాగ్ లోని లోకల్ ఛానెల్స్ లో యాంకర్ గా పని చేసిన సిరి ఆ తరువాత బుల్లితెరపై అవకాశాలు సంపాదించుకుంది. సొంతం గా “హే సిరి” అంటూ ఓ ఛానల్ ను కూడా స్టార్ట్ చేసింది. సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి సీరియల్స్ లో కూడా మంచి రోల్స్ ను సాధించుకున్న సిరి నిత్యం వీడియోస్ పోస్ట్ చేస్తూ యూత్ తో కూడా టచ్ లోనే ఉంటోంది.


End of Article

You may also like