ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

Video Advertisement

viswa 1

మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో నటుడు విశ్వ కూడా ఉన్నారు. పదునాలుగవ కంటెస్టెంట్ అడుగు పెట్టిన విశ్వ తన ఎమోషనల్ జర్నీ ని వ్యక్తపరిచారు.

viswa 2

చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటు ఇండస్ట్రీ లోకి అడుగుటపెట్టాను అంటూ విశ్వ గుర్తు చేసుకున్నారు. నిలదొక్కుకుంటున్న టైం లో తన తమ్ముడి మరణం కుంగదీసింది అని ఆవేదన చెందారు. తిరిగి నిలబడ్డానని.. ఓడిపోలేదని చెప్పుకొచ్చారు. యువ సీరియల్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన విశ్వ తన కెరీర్ నాగ్ చేతులమీదుగానే మొదలైంది అని చెప్పుకొచ్చారు. నాగ చైతన్య హీరో గా వచ్చిన “జోష్” సినిమాలో కూడా తనను ఉండాలని ఆరోజుల్లో నాగ్ అన్నారని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.