మరిన్ని ట్విస్ట్ లతో రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండబోతున్న బిగ్‌బాస్ తెలుగు-7..!

మరిన్ని ట్విస్ట్ లతో రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండబోతున్న బిగ్‌బాస్ తెలుగు-7..!

by Mohana Priya

Ads

బుల్లితెర ప్రేక్షకులకు ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రియాలిటీ షో ఏది అంటే అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 7 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

దీనికి తోడు గత సీజన్ ఫెయిల్యూర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్ కి మొదటి నుంచే హడావిడి మొదలుపెట్టిన టీం వరుసగా ప్రోమో లు రిలీజ్ చేస్తూ షో పై ఆసక్తిని మరింత పెంచుతుంది.

బిగ్ బాస్ సీజన్ 7 కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ లా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. కింగ్ నాక్ చెప్పే ప్రతి డైలాగ్.. రాబోయే సీజన్ పై ఆసక్తితో పాటు ఉత్కంఠతను కూడా రేపుతోంది. మొదటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 6 లో కాస్త తడబడింది.

సీజన్ 6 లో పాల్గొన్న హౌస్ మేట్స్ ప్రవర్తన దగ్గర నుంచి సోలో భాగంగా జరిగిన పలు రకాల పోటీల వరకు ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ గా మారిన విషయం తెలిసిందే. ఒక్క షో కూడా మిస్ కాకుండా టైం కి టీవీల ముందు కూర్చునే జనం విసుగు పుట్టి చూడడం ఆపేసారంటే అది ఏ రేంజ్ డిసప్పాయింట్మెంట్ ఆలోచించండి. అందుకే ఈసారి ఎలాగైనా తిరిగి బిగ్ బాస్ పై క్రేజ్ పెంచాలని సీజన్ 7 ను వినూత్నంగా మన ముందుకు తీసుకురాబోతున్నారు.

అదే విషయం ప్రోమోలో నాగార్జున కూడా తనదైన స్టైల్ లో తెలియజేశారు. ఈసారి సీజన్ ఊహకు అందని రేంజ్ లో ఉంటుందని…హౌస్ లోకి రాకముందే కంటెస్టెంట్ ఫుల్ ప్రిపరేషన్ తో వస్తారని.. ఎంత ప్రిపేర్ అయినా బిగ్ బాస్ ముందు ఎవరి మైండ్ గేమ్స్ చెల్లవని.. నాగార్జున వెల్లడించారు. సెప్టెంబర్ 3న ప్రారంభం కాబోతున్న ఈ రియాలిటీ షో కోసం తెలుగింటి టీవీలు తహతహలాడుతున్నాయి.

ALSO READ : “సామజవరగమన” లో ఈ సీన్ ఎందుకు డిలీట్ చేసారో.? “వెన్నెల కిశోర్” కామెడీ మాములుగా లేదుగా.?


End of Article

You may also like