Bigg Boss Telugu-5 : ప్రియాంకకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రియ..!ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..?

Bigg Boss Telugu-5 : ప్రియాంకకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రియ..!ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి వారంలోకి ఎంటర్ అయింది. గత వారం జరిగిన ఎలిమినేషన్‌లో కాజల్ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఫైనలిస్ట్ లుగా సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ నిలిచారు. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ చివరి ఎపిసోడ్‌కి అతిధులుగా ప్రముఖ సెలబ్రిటీలు వస్తారని సమాచారం. ఎపిసోడ్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసారట.

Video Advertisement

బిగ్ బాస్ లో ఉన్నపుడు ప్రియ, ప్రియాంక సింగ్ ఎంత క్లోజ్ గా ఉండేవారో అందరికి తెలుసు. ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత ప్రియాంక సింగ్ చాలా బాధ పడ్డారు. చాలా సార్లు ప్రియాంక సింగ్, ప్రియ తనకి అక్కలాంటి వారు అని చెప్పారు.

వీరిద్దరూ బయటకి వచ్చిన తర్వాత ఎన్నో సార్లు కలవడం, ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం చూస్తునే ఉన్నాం. అయితే, ఇటీవల ప్రియ, ప్రియాంకకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రియాంక సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ప్రియ, ప్రియాంక కి ఒక డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చారు. ఈ ఫోటోని ప్రియాంక షేర్ చేసి, గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రియకి థాంక్స్ చెప్పారు.

Also Read: వైరల్ అవుతున్న బిగ్‌బాస్ “షణ్ముఖ్-సిరి” లిప్‌లాక్ వీడియో..! “ఇందులో నిజం ఎంత?” అంటూ కామెంట్స్..!


End of Article

You may also like