“షో వల్ల ఒరిగేది ఏమీ లేదు..!” అంటూ… బిగ్‌బాస్ తెలుగు-5 విన్నర్ “సన్నీ” కామెంట్స్..!

“షో వల్ల ఒరిగేది ఏమీ లేదు..!” అంటూ… బిగ్‌బాస్ తెలుగు-5 విన్నర్ “సన్నీ” కామెంట్స్..!

by Anudeep

Ads

బుల్లితెర రియాలిటీ షోలలో ఎక్కువ క్రేజ్ ఉన్న షో బిగ్ బాస్ అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సాధారణంగా బిగ్ బాస్ షోలో విన్నర్ గా నిలబడడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అలా విన్నర్ గా నిలబడిన వారు సెలబ్రిటీ అయితే వాళ్ల కెరీర్ కి ఇంకా ఢోకా ఉండదని ఎక్కడికో వెళ్లిపోతారని చాలామంది భావిస్తారు..

Video Advertisement

కానీ అంచనాలకు భిన్నంగా బిగ్ బాస్ తెలుగు విన్నర్లుగా నిలిచిన వాళ్ళు జాతకాలు మాత్రం పెద్దగా మారలేదు. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో విన్నర్ విజె సన్నీ అని మనందరికీ తెలిసిన విషయం. ఈమధ్య రీసెంట్ గా విజె సన్నీ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ కొని షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ దాని వల్ల ఒరిగేదేం లేదని సన్నీ చెప్పుకొచ్చారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను బిగ్ బాస్ షో విన్నర్ ని అని చెబితే అసలు ఆ బిగ్ బాస్ షో అంటే ఏమిటి అనే రివర్స్ లో అతన్ని ప్రశ్నిస్తున్నారని సన్నీ పేర్కొన్నారు. బిగ్ బాస్ షో వల్ల తనకు పేరు వచ్చిందన్నమాట నిజమైనప్పటికీ ఇంకా చాలామందికి అతని గురించి తెలియదని ఆయన కామెంట్ చేశారు. అంత ఎందుకు ఓ ప్రముఖ దర్శకుడు కూడా అతన్ని అదే విధంగా అడిగారు అని చెప్పడం గమనార్హం.

vj sunny 2

బిగ్ బాస్ షో చాలామంది కెరీర్ కు ప్లస్ అయినప్పటికీ కొంతమందికి మాత్రం అంతగా అచ్చి రాలేదు అన్న విషయం మనకు తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు మాత్రం బిగ్ బాస్ షో వల్ల వాళ్ల జీవితాల్లో ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. కానీ సన్నీ మాత్రం ఇప్పుడు బిగ్ బాస్ విజేతనని చెప్పుకోవడం ఆపేసి తిరిగి సీరియల్స్ లో తన కెరీర్ కొనసాగిస్తున్నానని చెప్పారు.

vj sunny 1

మరోపక్క తమకు మంచి గుర్తింపు తెచ్చిన బిగ్ బాస్ షో గురించి ఆ షోలో విన్నర్లుగా నిలిచిన సెలబ్రిటీలే ఇటువంటి కామెంట్స్ చేయడంపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో సీజన్ 6 కు విజేతగా ఎవరు నిలుస్తారు అనేది పెద్ద చర్చనీయాంశం గా మారింది. దానితో పాటుగా బిగ్ బాస్ షో విజేతలైన సెలబ్రిటీల కెరీర్ కు ఎందుకు బూస్ట్ ఇవ్వలేకపోతుంది అనే విషయంపై కూడా అభిమానుల మధ్య చర్చ జరుగుతుంది.


End of Article

You may also like