అదే పాట..! ఇంకా ఎన్ని రోజులు ఇదే చెప్తాడు..?

అదే పాట..! ఇంకా ఎన్ని రోజులు ఇదే చెప్తాడు..?

by Harika

Ads

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ వేడివేడిగా సాగాయి. నేను రైతు బిడ్డ అని చెప్పుకునే బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన ఓవర్ యాక్షన్ రాజా పల్లవి ప్రశాంత్‌ని, అలాగే బిగ్ బాస్‌కి నేనే కింగ్ అని ఫీల్ అవుతున్న శివాజీని కూడా హౌస్‌మేట్స్ నామినేషన్స్‌లో రివెంజ్ తీసుకున్నారు.

Video Advertisement

షో షార్ట్ అయి రెండు వారాలే అయిన బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడిప్పుడే గొడవలు మొదలయ్యాయి. ప్రశాంత్‌పై రివెంజ్ తీసుకోవడానికి అందరు లైన్ మీద నామినేట్ చేశారు. హౌస్‌లో నువ్వు నాకు కనిపించడం లేదని మొదట షకీలా నామినేట్ చేయగా.. తర్వాత గౌతమ్ కృష్ణ కూడా కారణం చెబుతూ నామినేట్ చేశాడు.

కానీ ప్రశాంత్ గౌతమ్‌ని కారణం చెప్పనివ్వలేదు. దీంతో ప్రియాంక ఫస్ట్ కారణం చెప్పింది విను తర్వాత మాట్లాడు అని ప్రశాంత్‌పై సీరియస్ అయ్యింది. ఒకటే పాట ‘రైతుబిడ్డ’ అని.. హౌస్‌లో రైతుబిడ్డ అని ఒకటే పాట మారుమ్రోగుతుందని హౌస్‌మేట్స్ ఫీల్ అవుతున్నారు. అమర్‌దీప్ అయితే ఈ పాట విని విని చిరాకు అవుతున్నాడు. ప్రతీసారి ఈ సెంటిమెంట్ డైలాగ్ వాడి సింపథీ సంపాదించుకోకని అమర్‌దీప్ అన్నాడు.

కానీ ప్రశాంత్ అంతటితో ఊరుకోకుండా సీరియల్‌లో చేసిన యాక్టింగ్ ఇక్కడ చేయకని మాటకుమాట తలపడ్డారు. దీంతో సందీప్ భారత్‌లో పుట్టిన ప్రతీఒక్కరూ కూడా రైతుబిడ్డ అని సందీప్ కౌంటర్ ఇచ్చాడు. ఉహించని రీతిలో రతిక ప్రశ్న రైతుబిడ్డని ఓవర్ యాక్షన్ చేసిన ప్రశాంత్‌ని హౌస్ మేట్స్ నామినేట్ చేయడంతో పాటు వ్యతిరేకంగా మాట్లాడటంతో ప్రశాంత్ కన్నీరు పెట్టుకున్నాడు.

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇదే స్టూడియో ముందు కుక్కలా తిరిగా అని ఏడ్చాడు. దీంతో రతిక కుక్కలా తిరిగావు. ఇఫ్పుడు అవకాశం వచ్చింది. కానీ ఏం చేస్తున్నావు? అని ప్రశ్నించింది. ఉహించని రీతిలో రతిక ప్రశ్నించే సరికి ప్రశాంత్ కామ్‌గా ఉండిపోయిన ప్రోమో తెగ వైరల్అవుతోంది.

ALSO READ : “పుష్ప” టీమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..! కారణం ఏంటంటే..?


End of Article

You may also like