“పుష్ప” టీమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..! కారణం ఏంటంటే..?

“పుష్ప” టీమ్ ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు..! కారణం ఏంటంటే..?

by kavitha

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

Video Advertisement

బాలీవుడ్ లో ఊహించని విధంగా ఈ మూవీ రూ.108 కోట్ల వసూళ్లను సాధించి, అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ‘పుష్ప 2 ‘ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే పుష్ప టీమ్ ని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 కోసం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ నుంచి కేరళ వరకు ఉన్న ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కోసమే ఊహించని స్థాయిలో కోట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్లు కూడా సిద్ధమవుతున్నారు. బాహుబలి, కేజిఎఫ్ సినిమాల తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటే ప్యాన్ ఇండియా సినిమాగా పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. అల్లు అర్జున్  కుర్చీ మీద కూర్చున్న ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా, హీరో చేయి ఫోటోతోనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. చూపుడు వేలుకు, ఉంగరం వేళ్ళకి రింగు ఉండగా, చిటికెన వేలు గోరుకు ఎర్రని నెయిల్ పాలిష్ తో  హైలెట్ చేశారు.  ఈ మూవీని 2024 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది.
అయితే ఈ పోస్టర్ పై కొందరు నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్యన రిలీజ్ చేసిన పోస్టర్ ని కొంచెం మార్చి అల్లు అర్జున్ డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ను సస్పెన్స్ గా ప్రకటించినపుడు ఇంకా మంచి పోస్టర్ ను ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా అంటున్నారు. అది మాత్రమే కాకుండా శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అన్నారు. రెండు క్లాష్ అవుతే రెండింటిలో ఏ మూవీ హిట్ అవుతుందనదే చూడాలి.

Also Read: ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి తెలుగు జాతి గౌరవాన్ని పెంచాడు..! ఎవరో తెలుసా..?


End of Article

You may also like