గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్చర్స్ అంటూ కొందరు తమ అభిమాన హీరో, హీరోయిన్ల పాత ఫోటోలు లేదా చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో షేర్ చేయడం, అవి వైరల్ అవడం తెలిసిందే. తాజాగా అలాంటి ఫోటోనే సామాజిక మధ్యమాలలో హల్ చల్ చేస్తోంది.

Video Advertisement

అది కూడా ఒక దివంగత, లెజెండరీ స్టార్ హీరో చిన్నప్పటి ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫోటోలో తాతగారి  పక్కన నిలుచున్న ఆ బాబు, పెద్దయ్యాక  తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా నిలిచిపోయారు. మరి ఆ లెజండరీ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సినీరంగంలో టాప్ హీరోగా మాత్రమే కాకుండా తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి. రాజకీయాల్లో అడుగుపెట్టి  చరిత్ర సృష్టించి, తెలుగు వారి పేరును నలువైపులా వ్యాపింపజేశారు. ఆయనెవరో కాదు, నట సార్వ భౌముడిగా పేరుగాంచిన నందమూరి తారకరామారావు. తెలుగువారు ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఆర్.
ఎన్టీ రామరావుగారితో ఉన్న వ్యక్తి ఆయన తాతగారు రామస్వామి చౌదరి. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలోని కృష్ణ జిల్లాలో నిమ్మకూరులో నందమూరి కుటుంబంలో 1923లో మే 28న ఎన్టీ రామారావు జన్మించారు. ఎన్టిఆర్ తండ్రి పేరు లక్ష్మయ్య, తల్లి పేరు వెంకట్రావమ్మ. వీరికి ఇద్దరు పిల్లలు. వారే నందమూరి తారక రామారావు మరియు నందమూరి త్రివిక్రమరావు. ఎన్టీఆర్ చిన్నతనంలో తన తాత రామస్వామి చౌదరి వద్దనే పెరిగారు. 1928 లో హీరో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తాత బడిపంతులు అయిన గద్దె వెంకట సుబ్బయ్య దగ్గర అక్షరాలు నేర్చుకున్నారు.
పెద్దయ్యాక మనదేశం మూవీతోఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్, ఆయన కెరీర్ లో పౌరాణిక, సాంఘిక, జానపద, సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి, మెప్పించారు. ఆయన తెలుగు, హిందీ, తమిళం భాషల్లో సుమారు 400 సినిమాలలో నటించారు. నిర్మాతగా, దర్శకుడిగా  పని చేశారు. రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక క్యారెక్టర్లతో తెలుగు వారి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. రాజకీయాల్లో అడుగు పెట్టి, తెలుగుదేశం పార్టీని స్థాపించి, 9  నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజలకు సేవ చేశారు.

Also Read: హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈ వ్యక్తికి ఏమయ్యింది..? ఇతని ఫెయిల్యూర్ కి కారణాలు ఇవేనా..?