‘బిగ్ బాస్’ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఎవరంటే..??

‘బిగ్ బాస్’ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఎవరంటే..??

by Anudeep

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా.. బిగ్ బాస్ కి ప్రత్యేక ప్రేక్షకాదరణ ఉంది. తెలుగులో సూపర్ హిట్ అయినా ఈ షో ఇప్పటికే ఆరు రెగ్యులర్ సీజన్లు, ఒక ఓటీటీ వెర్షన్ లను పూర్తి చేసుకుంది. అయితే ఈ సీజన్లు అన్ని ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. సరికొత్త ప్రయోగాలు, ప్రైజ్ మనీ కోతలు ఏం చేసినా సరే మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఈ ఆరో సీజన్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Video Advertisement

 

 

దీంతో ఏడో సీజన్ ను ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో బిగ్ బాస్ మేనేజ్ మెంట్ టీమ్ ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని వచ్చే ఏడాది జూలైలోనే మొదలు పెట్టాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే ఎదో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి.

biggboss 7 telugu contestants list leacked..!!

ఏడో సీజన్లో పలువురు ఫేమస్ సెలెబ్రెటీలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతి సీజన్ లోనూ ఓ సింగర్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారన్న సంగతి తెలిసిందే. రాహుల్… రేవంత్ కూడా అలా వచ్చి ట్రోఫీ గెలుచుకున్న‌వారే…. అయితే ఈ సీజన్ లో కూడా ఓ సింగ‌ర్ ను తీసుకోబోతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. బులెట్ బండి సాంగ్ తో ఫేమస్ అయిన మోహన భోగరాజు పేరు వినిపిస్తోంది.

biggboss 7 telugu contestants list leacked..!!

అలాగే ఈ సీజన్ లో కూడా మరో కపుల్ ను బిగ్ బాస్ లోకి తీసుకురావాలని బీబీ టీం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సీరియల్ హీరో అమర్ దీప్ చౌద‌రి మరియు తేజస్విని గౌడ్ జంట‌ను ఎంపిక చేసిన‌ట్టు టాక్. అలాగే కార్తీక దీపం తో ఫేమస్ అయిన ‘శోభా శెట్టి’ ని కూడా ఈ సీజన్ లో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీవీ 9 యాంకర్ ప్రత్యుషా, మిత్ర శర్మ, దీపికా పిల్లి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సీజన్ కి హోస్ట్ గా రానా దగ్గుబాటి లేదా బాలయ్య హోస్ట్ గా చేసే అవకాశం ఉంది.


You may also like

Leave a Comment