ఒకే ఒక హిట్టుతో రెమ్యూనరేషన్ డబల్ చేసిన కుర్ర డైరెక్టర్..!

ఒకే ఒక హిట్టుతో రెమ్యూనరేషన్ డబల్ చేసిన కుర్ర డైరెక్టర్..!

by Anudeep

Ads

కొత్త టాలెంట్‌ను నిరంతరం ప్రోత్సహించే టాలీవుడ్ హీరోలలో నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ని కలిగి ఉండటం వల్ల కల్యాణ్ రామ్ వినూత్నమైన కొత్త తరహా చిత్రాలను తీయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.

Video Advertisement

అలా ఆయన ప్రోత్సహించిన కొత్త డైరెక్టర్ వశిష్ట. తాజా సంచలనాత్మక సోషియో-ఫాంటసీ చిత్రం బింబిసారకు డైరెక్ట్ చేశాడు వశిష్ట. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఈ సంవత్సరం లో అతిపెద్ద హిట్గా నిలిచింది.

ఇవి కూడా చదవండి: “సారంగ దరియ” పాటలో “సాయి పల్లవి” పక్కన డాన్స్ చేసిన ఈ అమ్మాయిని గమనించారా.?

 

ఈ సినిమా విడుదల కూడా కాకముందే కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించారు. ఊహించని విధంగా ఈ చిత్రం భారీ ప్రేక్షకాదరణ పొందడంతో రాబోయే సీక్వెల్ పై అంచనాలు కూడా పెరిగాయి. ఇదిలా ఉండగా విశిష్ట ఆల్రెడీ ఈ సీక్వెల్ కథపై వర్కౌట్ చేస్తున్నట్టు తెలిసింది. మొదటి సినిమా హిట్ అవ్వడంతో ఈ చిత్రానికి ఏకంగా వశిష్ట మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఇకపోతే ఎన్టీఆర్ లాంటి టాప్ యాక్టర్ బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశిష్ట గొప్ప డైరెక్టర్ అవుతాడు అని అభినందించారు. ఊహించని విధంగా సెన్సేషనల్ హిట్ సాధించిన విశిష్ట కు ఇప్పుడు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

bimbisara

 

ఒక కొత్త డైరెక్టర్ రెండవ సినిమాకే మూడు కోట్లు తీసుకోవటం నిజంగా ఆశ్చర్యమైన విషయమని ఇండస్ట్రీలో టాక్. రెండవ సినిమాకి మూడు కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్న విశిష్ట దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ పెంచాలి అనుకున్నాడో ఏమో ఏకంగా తన రమ్యునరేషన్ ఇప్పుడు 6 కోట్లు చేశాడు.

Bimbisara Movie

బింబిసార సీక్వెల్ తర్వాత తను చేయబోయే చిత్రానికి అక్షరాల ఆరు కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. ఈ వార్త విని ఓపక్క అగ్ర డైరెక్టర్లు బెంబేలు పడుతుంటే మరోపక్క కొందరు ఇలా పక్కా కమర్షియల్ గా ఉంటేనే సక్సెస్ అవుతారు గురు అని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్క సినిమా సక్సెస్ తో ఓ డైరెక్టర్ అంత భారీ రెమ్యూనరేషన్ అందుకోవడం తెలుగు సినీ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది.

ఇవి కూడా చదవండి: “దేవత” పాత్రలో నటించి మెప్పించిన 10 మంది హీరోయిన్లు…అందరిలో హైలైట్ ఎవరంటే.?

 


End of Article

You may also like