Ads
గత కొద్ది సీజన్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్ల ప్రభావం టీమ్స్ యొక్క ఆటతీరు పై పడింది. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
#1 మొదటిది ట్రెంట్ బౌల్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ నుండి ముంబై ఇండియన్స్ కి మారడం. ఈ ప్రపంచంలో టాప్ బౌలర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ట్రెంట్ బౌల్ట్. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టులని రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నారు.
ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2.2 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా, తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం దాదాపు 3.2 కోట్ల ఆక్షన్ తో ట్రెంట్ బౌల్ట్ ని టీం లోకి తెచ్చుకున్నారు. ఇది పొరపాటు అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక వేళ కగిసో రబాడా (ఢిల్లీ క్యాపిటల్స్), ఇంకా ట్రెంట్ బౌల్ట్ కలిసి ఆడితే జట్టుకు చాలా లాభాలు ఉండేవి. ఇప్పుడు ట్రెంట్ బౌల్ట్ ముంబై ఇండియన్స్ జట్టు కి వెళ్లడం వల్ల జట్టు బలపడింది.
#2 రెండవది క్వింటన్ డికాక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుండి ముంబై ఇండియన్స్ జట్టుకి మారడం. సౌత్ ఆఫ్రికా లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ ఇంకా వికెట్ కీపర్ అయిన క్వింటన్ డికాక్ 2019 లో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడారు.
2018 మెగా ఆక్షన్ లో 2.8 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వింటన్ డికాక్ ని తమ టీం లోకి తెచ్చుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున 8 ఇన్నింగ్స్ ఆడారు. టోర్నమెంట్ చివరిలో ప్లేయింగ్ ఎలెవెన్ నుండి తొలగించబడ్డారు క్వింటన్ డికాక్. మిగిలిన సీజన్ లో విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్ బ్యాటింగ్ ప్రారంభించే బాధ్యతను తీసుకున్నారు.
ఏదేమైనా, ఇది మాత్రం ఆర్సిబి యాజమాన్యం చేసిన పొరపాటే. ఆరోన్ ఫించ్ లేదా జోష్ ఫిలిప్ కాకుండా క్వింటన్ డికాక్ కనుక ఆర్సిబి ఎలెవెన్ లో భాగమైతే ఎబి డివిలియర్స్ కి ఒత్తిడి కొంచెం తగ్గేది. తర్వాత సంవత్సరం ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడారు క్వింటన్ డికాక్.
ముంబై ఇండియన్స్ జట్టు తో ఆడిన మొదటి సీజన్ లో 500 పరుగులకు పైగా స్కోర్ చేశారు. ఈ సీజన్ లో మాత్రమే కాకుండా, ముంబై ఇండియన్స్ జట్టు తరపున కూడా 13 ఇన్నింగ్స్ లో 135.71 స్ట్రైక్ రేట్ తో 418 పరుగుల టాప్ స్కోర్ చేశారు.
Also Read >>> ఐపీఎల్ 2020 లో ఈ టీం ల కెప్టెన్ ల జీతాలు ఎంతో తెలుసా.? అందరికంటే ఎవరికి ఎక్కువ అంటే.?
End of Article