ప్లీజ్…నా బాయ్ ఫ్రెండ్ ని కలవాలి…అనుమతించండి అంటూ పోలీస్ స్టేషన్ లో యువతి హల్చల్.!

ప్లీజ్…నా బాయ్ ఫ్రెండ్ ని కలవాలి…అనుమతించండి అంటూ పోలీస్ స్టేషన్ లో యువతి హల్చల్.!

by Anudeep

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు..ఈ కరోనా పోలీసులకు ఒక విషమ పరీక్ష అయిపోయింది..ఒకవైపు లాక్ డౌన్ పాటించని వారిని కంట్రోల్ చేయడానికి నానా తిప్పలు పడి, ఇక లాఠీలకు పని చెప్తున్నారు.మరోవైపు  లాక్ డౌన్ మూలంగా చిత్రవిచిత్రమైన సమస్యలతో పోలీసు స్టేషన్ కి వస్తున్న వారితో కొత్త చిక్కొచ్చి పడింది. తాజాగా బాయ్ ఫ్రెండ్ ని నన్ను కలపండంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది.

Video Advertisement

ఇప్పటివరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లం బతికాం . ఉద్యోగం, ఊరిమీద షికార్లు అంటూ మనకి నచ్చినప్పుడు నచ్చినచోటికి వెళ్తూ, లాక్ డౌన్ తో ఒక్కసారిగా కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టినట్టుగా ఫీలవుతున్నారు చాలామంది. సార్ , ఇంట్లో మా ఆవిడతో బాధ పడలేకపోతున్నా,కనీసం టివిలో అయినా మంచి సినిమాలు వేయించండి అని మంత్రి కెటిఆర్ కే మొర పెట్టుకున్నాడో నెటిజన్ . పిల్లులకి ఫూడ్ కోసం బయటికి వెళ్లాలి పర్మిషన్ ఇవ్వండంటూ ఒకరు ప్రాధేయపడితే, బాయ్ ఫ్రెండ్ ని కలపమని రిక్వెస్ట్ చేసింది ఒక యువతి.

Also Read >>>లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!

ప్రేమికుల తిప్పలను కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన ఈ సంఘటన చోటుచేసుకున్నది హైదరాబాద్ లో..  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తన బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ కావాలంటూ కోరింది ఓ యువతి . ఏకంగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళి మరీ అనుమతి ఇవ్వాలని అడగటంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. అంతకుముందు రోజు రాత్రే ఆ అమ్మాయిని చూడడానికి తన బాయ్ ఫ్రెండ్ వాళ్లింటికి వస్తే, అమ్మాయిని వేదిస్తున్నాడని అమ్మాయి పేరెంట్స్ కంప్లైంట్స్ చేశారు.

ఎలా తప్పించుకోవాలో అర్దం కాక మన ప్రేమికుడు, నేను అసలు ఆ అమ్మాయిని ప్రేమించట్లేదు, ఆ విషయం చెప్పడానికే వాళ్లింటికొచ్చా అని చెప్పి ఆ క్షణానికి తప్పించుకున్నాడు. దీంతో షాక్ తిన్న అమ్మాయి మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించింది. నాకు న్యాయం చేయండి, నా బాయ్ ఫ్రెండ్ తో కలపండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంది . చివరికి ఆ అమ్మాయికి నచ్చ చెప్పి ఇంటికి పంపించారు పోలీసులు..  సోషల్ మీడియాలో వచ్చిన ఈ న్యూస్ ఒక్కసారిగా వైరలైంది ప్రేమికుల బాధ ఎలా ఉంటుందో చూడండి అంటూ నెటిజన్లు తెగ వైరల్ చేశారు.

Also Read >>>లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.!


You may also like