ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అద్దాలు మధ్యలోనే ఎందుకు పగులుతాయి..? అసలు కారణం ఇదే..!

ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అద్దాలు మధ్యలోనే ఎందుకు పగులుతాయి..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

సాధారణంగా మనం సినిమాల్లో చూసినట్లయితే ఫైర్ ఆక్సిడెంట్ లాంటివి అయినప్పుడు అద్దాలు పగిలిపోవడం, విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. చాలా యాక్షన్స్ సినిమాల్లో వీటిని ఎక్కువగా మనం చూసే ఉంటాం. అయితే అసలు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు గ్లాస్ పగిలిపోతుంది..? ఈ విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

Video Advertisement

గ్లాస్ దానంతట అదే విరిగిపోతుంది అంటే ఎటువంటి మాయా జరగదు. పెద్ద పెద్ద మంటలు వచ్చినప్పుడు వాటంతటవే విరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అద్దాలకి ఫైర్ రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా అద్దాలు వంటివి ఉన్నప్పుడు మంట వచ్చింది అంటే వాటికి వేడి అనేది ఒకేలా పట్టదు. ముఖ్యంగా అద్దానికి ఉండే మధ్య భాగంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది.

మిగిలిన వాటితో పోల్చుకుంటే అక్కడ ఎక్కువ వేడి ఉండడం జరుగుతుంది. దీనితో హీట్ గ్రేడియంట్ ని క్రియేట్ చేస్తాయి. ఇదిలా ఉంటే మంటలు వచ్చినప్పుడు ఒక పక్క అద్దానికి హీట్ ఫ్లక్స్ అవడం.. ఒక పక్క థర్మల్ గ్రేడియంట్ పడుతుంది.

అయితే థర్మల్ స్ట్రెస్ అనేది గ్లాస్ మధ్య భాగం మీద పడుతుంది. అలానే మంట థర్మల్ హీట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీద పడుతుంది ఆ తర్వాత అర్థం చివరి భాగంలో ఎనర్జీ లేదా వేడిని కోల్పోతుంది. పైగా మధ్య భాగంలో వేడి ఎక్కువ పడుతుంది కాబట్టి గాజు ఎక్స్పాండ్ అవుతుంది. ఇక గ్రేడియంట్ మారుతూ ఉండడం వల్ల కూడా అద్దం విరిగిపోతుంది.


End of Article

You may also like