Ads
పెళ్లి తో రెండు కుటుంబాలు ఒకటవుతాయి. రెండు మనసులు దగ్గర అవుతాయి. జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైనది. వివాహం తో జీవితం మరో మలుపు తిరుగుతుంది.పెళ్లి అంటే ఎంతో ఆనందంగా బంధుమిత్రులందరినీ పిలుచుకుని జరుపుకునే పెద్ద వేడుక. అయితే అంత పెద్ద వేడుకలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Video Advertisement
ఇలా జరగడంతో అందరూ షాక్ అయ్యారు. ఒక్క సారిగా ఉన్న ఆనందం అంతా కూడా కుప్పకూలి పోయింది. శోకసంద్రంలో తల్లిదండ్రులు మునిగి పోయారు.
ఇక వివరాల్లోకి వెళితే… కోలార్ కి చెందిన చైత్ర (26) యువతికి పెళ్లీడు వచ్చింది. దీనితో తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అయితే మంచి అబ్బాయి దొరకగా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు తల్లిదండ్రులు. ఇంకేముంది మూడు ముళ్లు పడి ఒక ఇంటికి తన కుమార్తెను పంపించాలని అనుకున్నారు.
శుక్రవారం బంధుమిత్రులు అందరూ కూడా పెళ్లి కి వచ్చారు. వరుడు తో కలిసి చైత్ర ఫోటోలు తీసుకుంటుండగా ఒక్క సారిగా పెళ్లి మండపంలోనే ఆమె కుప్పకూలి పోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్లగా ఆమెకి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు.
ఇంకేముంది అప్పటి వరకు ఉన్న ఆనందం అంతా కూడా ముక్కలైపోయింది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో తల్లిదండ్రులు తన కుమార్తె అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవయవాలను ఇచ్చేందుకు పూర్తి చేయాల్సిన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నిజానికి ఇంత బాధలో కూడా తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకోవడంతో అందరూ వారిని ప్రశంసిస్తున్నారు.
End of Article