ఈ పెళ్లి పత్రికలో రాసిన పెళ్లికూతురు పేరు చూశారా..? వారందరి పేర్లు కలిసి వచ్చేలా..?

ఈ పెళ్లి పత్రికలో రాసిన పెళ్లికూతురు పేరు చూశారా..? వారందరి పేర్లు కలిసి వచ్చేలా..?

by Mohana Priya

Ads

పెళ్ళిలో, ఫంక్షన్ హాల్, భోజనాలు, మిగిలిన ఏర్పాట్లు, పెళ్లి జరిగే స్థలం, ఇలా వీటన్నిటితో పాటు, ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది వెడ్డింగ్ కార్డ్. వెడ్డింగ్ కార్డ్ చాలా సింపుల్ గా ఉంటూనే, వివరాలు అన్ని తెలియజేసేలాగా ఉండాలి. అందుకే పెళ్లి కార్డ్ చాలా క్రియేటివ్ గా ఉండడంతో పాటు, ముఖ్యమైన సమాచారాన్ని కూడా ఇచ్చేలాగా ఉండాలి అని చాలా మంది డిజైన్ చేస్తారు. ఈమధ్య ఇందులో చాలా రకమైన వెరైటీలు వచ్చాయి. కొన్ని ఆన్ లైన్ లోనే పంపిస్తున్నారు. దూరంగా ఉన్న వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్స్ పంపించడం కష్టం. ఈ కారణంగానే వాట్సాప్ లో పంపించేలాగా వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇంకొంత మంది అయితే వెడ్డింగ్ కార్డ్ తో పాటు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అది చాలా మంది చేస్తున్నారు.

Video Advertisement

bride name on a wedding card

ఇంకా కొంత మంది అయితే ఒక వెడ్డింగ్ కార్డ్ ని బాక్స్ లో పెట్టి ఇస్తున్నారు. వెడ్డింగ్ కార్డ్ తో పాటు ఇంకా కొన్ని వస్తువులు కూడా ఇందులో పెట్టి ఇస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. ఒక బాక్స్ లో వెడ్డింగ్ కార్డ్ తో పాటు, డ్రై ఫ్రూట్స్, సెంటెడ్ కాండిల్స్ కూడా ఇస్తున్నారు. వీటితో పాటు ఇంక ఎవరి అభిరుచికి తగ్గట్టు వారు కొన్ని గిఫ్ట్ లు కూడా ఇస్తున్నారు. అయితే, ఇటీవల ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ వెడ్డింగ్ కార్డ్ లో, అమ్మాయి పేరు 16 దేవతల పేర్లు కలిసి వచ్చేలాగా పెట్టారు.

ఆ అమ్మాయి పేరు, వీర వెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవి లలితా పార్వతీ రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష. ఈ పేరుని వెడ్డింగ్ కార్డ్ లో ప్రచురించారు. ఈ పేరు సరిగ్గా గమనిస్తే ఇందులో 16 దేవతల పేర్లు ఉంటాయి. సాధారణంగా పేర్లలో దేవుళ్ల పేర్లు పెడతారు. దేవతల పేర్లు కూడా పేర్లలో పెట్టి నామకరణం చేస్తారు. కానీ 16 దేవతల పేర్లు పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి ఏమో. ఈ వెడ్డింగ్ కార్డ్ ని కోరాలో వెంకటరమణ సూరంపూడి గారు షేర్ చేశారు. పెళ్లి కూతురుకి 16 పేర్లు దేవతల పేర్లు పెట్టారు అని వెడ్డింగ్ కార్డ్ ని షేర్ చేశారు.


End of Article

You may also like