సాయంత్రం 6 తర్వాత ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే శని వచ్చినట్లే..!!

సాయంత్రం 6 తర్వాత ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే శని వచ్చినట్లే..!!

by Sunku Sravan

Ads

మనం ప్రతి రోజూ మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగానే తెలిసి తెలియక అనేక పొరపాట్లు కూడా చేస్తాం. ఈ విధంగా చేసే తప్పులే చివరికి అనేక సమస్యలకు దారి తీస్తాయి. కానీ ఇలాంటి విషయాలను కొందరు నమ్ముతారు మరి కొందరు నమ్మరు.

Video Advertisement

మరి వీటిని పాటించాలా లేదా అనేది మాత్రం వారి యొక్క వ్యక్తిగత విషయం. పూర్వీకుల నుండి మన ఇంట్లో కొన్ని సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. దాని ప్రకారమే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటో చూద్దాం.ప్రతిరోజు మనం నిద్ర లేచిన తర్వాత తప్పనిసరిగా దుప్పటిని మడిచి పెట్టాలి.

లేదంటే దరిద్ర దేవత కొలువుదీరి ఉంటుంది. అలాగే చాలామంది పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచి వాకిలి చల్లుకుంటారు. దీనివల్ల కూడా దరిద్రం చుట్టుకుంటుంది. ఇంకొంతమంది తినడం అయిపోయిన తర్వాత కూడా ఎంగిలి కంచం ముందు కూర్చొని ఉంటారు. అలా ఎప్పుడూ కూడా కూర్చోకూడదు. పూజ గదిలో ఓకే దేవుడికి చెందినటువంటి రెండు ఫోటోలు కూడా ఉండకూడదు. అలాగే ఏవైనా విగ్రహాలు ఉంటే మాత్రం తక్కువ ఎత్తులో ఉండాలి. మనం పూజ చేసే టైంలో దేవుడి ముందు ఖచ్చితంగా నీటిని పెట్టాలి.

 

 

అలాగే పూజ గదిలో ఒక్క ప్రమిద పెట్టేవారు మూడు వత్తులు వేయాలి. లేదంటే అంతకంటే ఎక్కువ ప్రమిదలు వెలిగించే వారైతే రెండు వత్తులను వేసి దీపారాధన చేయాలి. దీపారాధనకు సంబంధించి మన స్తోమతకు తగ్గ నూనెను ఉపయోగించవచ్చు. కానీ ఏదైనా ప్రత్యేక పూజలు చేసే సమయంలో మాత్రం దీపారాధనకు వాడే నూనె మాత్రమే ఉపయోగించాలి. అంతేకాకుండా ఆవునెయ్యి, నువ్వుల నూనె వంటివాటితో పూజ చేయాలి. అలాగే సాయంత్రం ఆరు దాటింది అంటే కోడిగుడ్లు, ఉప్పు, సూది, నూనె ఇంట్లోకి తేకూడదు . ఇవి శని స్థానాలు కనుక వాటిని ఆ సమయంలో ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోకి శని తెచ్చుకున్నట్టే. అందుకే పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: వినాయక చవితి ఉత్సవాల్లో గణపతి బప్పా “మోరియా” అని ఎందుకు అంటారు..?


End of Article

You may also like