Ads
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందు ఆలయాలు అన్నిటిలోకి అత్యంత ప్రసిద్ధమైనది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ వైకుంఠంగా భావించి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దివ్య క్షేత్రం తిరుమల.సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ఈ దివ్య క్షేత్రంలో బ్రిటిష్ వారు కొన్ని నియమాలు ప్రవేశ పెట్టడం జరిగిందట. చాలామందికి అసలు ఈ విషయం తెలియదు.. మరి ఇంతకీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందామా..
Video Advertisement
మన దేశాన్ని 200 సంవత్సరాల కు పైగా పరిపాలించిన బ్రిటిష్ దొరలు వెంకటేశ్వర స్వామి భక్తులుగా మారడమే కాకుండా గుడి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టారు. టీటీడీ వద్ద ఉన్న పురాతన ఆలయ రికార్డుల ప్రకారం 1801 నుంచి 1843 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణ బాధ్యతలను అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ అర్కాట్ నేతృత్వంలో జరిగింది.
అప్పట్లో దేవాలయంలో ఎన్నో అంతర్గత కలహాలు ఉండడంతో బ్రిటిష్ వారు కఠినమైన క్రమశిక్షణ మరియు నియమాలతో పాలనను గాడిలో పెట్టడం జరిగింది. ఈ మేరకు 183 జనవరి 31న తొలిసారిగా మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర తన నివేదికను కూడా సమర్పించారు. ఆయన తర్వాత విచారణ అధికారిగా వచ్చిన పి. బ్రూస్ టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలను నిర్దేశించారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ కూడా టీటీడీ ఆ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తోంది. మరి అవి ఏమిటో చూద్దాం..
1.దిట్టం
శ్రీవారికి సమర్పించేటటువంటి నైవేద్యానికి సంబంధించిన ముడి ఏ పరిమాణంలో తీసుకోవాలి నిర్ణయించేదే దిట్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదరూపేనా తయారు చేసే లడ్డూలు దగ్గర నుంచి వాడే పుష్పాల వరకు దీన్ని అనుసరిస్తారు.
2.కైంకర్యపట్టీ
తిరుమల తిరుపతి దేవస్థానంలోని సిబ్బంది, పరిచారికలు, మిరాశీ దారులు మరియు జియ్యర్ సిబ్బంది విధులకు సంబంధించి 1801 మరియు 1820లో రెండు సార్లు ఈ కైంకర్యపట్టీ తయారు చేయడం జరిగింది. దీని ఆధారంగానే సిబ్బంది యొక్క నియామకం, హోదా, విధులు ,జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి.
3.బ్రూస్ కోడ్
ఈస్ట్ ఇండియా కోడ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అప్పట్లో ఆలయ పాలన సక్రమంగా జరగడం కోసం బ్రూస్ కోడ్ అనే ప్రత్యేకమైన కోడ్ రూపొందించడం జరిగింది. నేటికీ ఆలయ పాలన దిక్సూచిగా ఈ బ్రూస్ కోడ్ వాడుతారు.
4.సవాల్- ఇ-జవాబు
శ్రీవారి ఆలయంలో జరుగుతున్నటువంటి వివిధ సేవలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల యొక్క ఇతిహాసం మరియు చరిత్రను తెలుసుకొనడం కోసం 1819లో ఈస్ట్ ఇండియా కంపెనీ 14 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలను రూపొందించింది. దీన్ని సవాల్- ఇ-జవాబు పట్టి అని పిలుస్తారు.
5.పైమేయిషి ఖాతా
ఆలయానికి సంబంధించిన స్థిరచరాస్తులు, దేవతా విగ్రహాలు, చిత్రాలు, తిరుమల మరియు తిరుపతి ఇతర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆలయ వివరాలు, ఇనాం గా ఇచ్చిన గ్రామాల యొక్క వివరాలను రికార్డు రూపంలో పొందు పరచడం జరిగింది. 1819లో రూపొందించిన ఈ రికార్డును “పైమేయిషి అకౌంట్” అని పిలుస్తారు.
End of Article