Ads
ఈ మధ్య కాలంలో చిత్రాల్లో మంచి అవుట్ కోసం ఎన్నో మార్పులు చేస్తున్నారు. సన్నివేశం పర్ఫెక్ట్ గా రావడానికి గ్రాఫిక్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఆ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Video Advertisement
టెక్నాలజీ పెరగకముందు గ్రాఫిక్స్ లేకుండా స్క్రిప్ట్ రాసుకునేవారు. కానీ ఇప్పటి రోజులు అంత టెక్నాలజీ మాయాజాలమే ఎక్కువగా ఉంటుంది. VFX ఎఫెక్ట్స్ యూజ్ చేసి చిత్రాన్ని కావలసిన విధంగా మార్చేస్తున్నారు మూవీ మేకర్స్. VFX ఎఫెక్ట్స్ అంటే ఏంటి అని తెలుసుకునే విషయంలో ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ వెతుకులాటలోనే సోషల్ మీడియాలో ఒక చిత్రానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 2012వ సంవత్సరంలో K.v ఆనంద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా బ్రదర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సూర్య అతుక్కుని పుట్టిన కవలలుగా ద్విపాత్రాభినయంలో నటించారు. సూర్య సరసన హీరోయిన్ గా కాజల్ నటించింది. జంటకవులుగా సూర్య నటన ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
మరి ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి నటించిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో జంటకవులలుగా నటించిన వారిలో సూర్య తో పాటు మరొక డూప్ యాక్టర్ ని మీరు గమనించే ఉంటారు. సూర్య పర్సనాలిటీకి మరియు ఎత్తుకు సరిపడే విధంగా ఒక వ్యక్తిని డూప్ ల పెట్టి ఆ సన్నివేశాలు చిత్రీకరించారు. ముందుగా సూర్య హావభావాలని పెర్ఫెక్టుగా షూట్ చేసి, VFX ఎఫెక్ట్స్ కి జతచేశారు.
ముఖ్యంగా ఎఫెక్ట్స్ చూపించిన సీన్స్ ఏంటంటే రెండే ఉండి పాటలో కవలలు ఇద్దరూ కలిసి స్నానం చేసే సన్నివేశం, కాజల్ ని కొత్తగా పరిచయం చేసుకునే సీన్, పోలీస్ స్టేషన్ సీన్ వంటివి VFX ఎఫెక్ట్ ని యూజ్ చేసి చిత్రీకరించారు.
ఎఫెక్ట్స్ ఎలా యూస్ చేశారో చెబుతూ వీడియో పోస్ట్ చేసారు చిత్ర యూనిట్. ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోని చూసి నెటిజన్లు, ఏంటి ఇది గ్రాఫిక్స్ అంటూ నోరెళ్లబెడుతారు. ఏమి మాయ చేసారు రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు.
watch this video :
End of Article