“బబుల్ గమ్” సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా..?

“బబుల్ గమ్” సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా..?

by kavitha

ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన తొలి మూవీ  ‘బబుల్ గమ్’. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మానస చౌదరి నటించింది. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలతో పేరు తెచ్చుకున్న రవికాంత్  ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

Video Advertisement

నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఏదైనా మూవీ విడుదల అయినపుడు చూసినవారు హీరో లేదా హీరోయిన్ గురించి మాట్లాడుకోవడం సర్వసాధారణం. కానీ ఈ బబుల్ గమ్ చూసిన తరువాత ఎక్కువ మంది చర్చించుకుంటున్నది చికెన్ కొట్టు యాదగిరి గురించి. అది హీరో రోషన్ తండ్రి క్యారెక్టర్. ఆ పాత్ర పోషించిన నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
బబుల్ గమ్ మూవీతో యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ పాపులర్ అయ్యింది హీరో తండ్రి చికెన్ కొట్టు యాదగిరి. ఈ పాత్రలో నటించిన యాక్టర్ పేరు చైతు జొన్నలగడ్డ.
ఈ పేరు వినగానే గుర్తొచ్చేది డిజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆయన అన్నయే చైతు జొన్నలగడ్డ.హీరోకి తండ్రిగా చైతు జొన్నలగడ్డ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ యాసలో చికెన్ కొట్టు యాదగిరి అద రగొట్టాడు.  ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను అలరిస్తాయి. హీరోయిన్ ఇంటికొచ్చినపుడు  ఈ హీరో, హీరో తండ్రి మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకుంది.
ఈ మూవీలో తండ్రిగా నటించినా, చైతు జొన్నలగడ్డని స్క్రీన్ పై మొదటిసారి చూసినపుడు హీరో అన్నయ్యలా అనిపిస్తారు. చైతు జొన్నలగడ్డ ఎక్స్ప్రెషన్స్, స్లాంగ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని హీరో  సిద్దు జొన్నలగడ్డను గుర్తొచ్చేలా చేస్తాయి. ఈ మూవీ చైతు జొన్నలగడ్డ మొదటి చిత్రం, అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లా నటించారు.

Also Read: VAISHNAVI CHAITANYA: మరొక బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ హీరోయిన్.. లక్ అంటే ఆమెదే!


You may also like

Leave a Comment