రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ప్రస్తుతం ఈ మూవీ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Video Advertisement

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆదిపురుష్ జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా విడుదల అవనుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దానిలో భాగంగా నేడు తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
a new contraversy triggered on aadipurush..ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్, ఇతర భాషలకు ఆ రాష్ట్రాలలోని లోకల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా టి సిరీస్ సొంతంగా విడుదల చేయాలని  అనుకుంటునట్లు తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రోజు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు చినజీయర్ స్వామి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.

Also Read: “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” కథలో నిజం ఎంత..? అసలు ఏం జరిగింది..?