1847లో అనగా భారత మొదటి స్వాతంత్ర పోరాటానికి పది సంవత్సరాల ముందే, బ్రిటిషు వారి అధికారాన్ని ఎదుర్కొని, వారిపై తిరుగుబాటు చేసిన మొదటి తెలుగు వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. 1846లో ప్రారంభం అయిన నరసింహారెడ్డి తిరుగుబాటు ఏడాది పాటు కొనసాగి 1847లో ఆయన మరణంతో ముగిసిపోయింది.
Video Advertisement
ఆ వీరుడి కథతో తెలుగులో సైరా అనే చిత్రం రూపొందించబడింది. ఇందులో నరసింహారెడ్డి పాత్రను మెగాస్టార్ చిరంజీవి పోషించారు. ఈ మూవీ రిలీజ్ తరువాత నరసింహారెడ్డి పాత్రపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆయన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు కాదని, ఆయన కన్నా ముందే మరొకరు బ్రిటిష్ వారిపై పోరాటం చేశారని వినిపించారు. ఆ వీరుడు ఎవరో? ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఉయ్యాలవాడ గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ఉయ్యాలవాడ గ్రామానికి నరసింహారెడ్డి తండ్రి అయిన పెద మల్లారెడ్డి పాలెగాడుగా ఉండేవాడు. నరసింహారెడ్డి తాత, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి సంతానం లేకపోవడంతో నరసింహారెడ్డిని దత్తతగా తీసుకున్నాడు. నరసింహారెడ్డికి తండ్రి తరపున మాసానికి 11 రూపాయల, పది అణాల, ఎనిమిది పైసలు భరణంగా వచ్చేది.
అయితే నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డి సంతానం లేకుండా చనిపోయారనే వంకతో అప్పటిదాకా ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో బ్రిటీషు ప్రభుత్వం రద్దుచేసింది. దానికి కారణం తెలియాలి అంటే పాలేగాళ్ల వ్యవస్థ గురించి తెలియాలి. పాలేగాళ్ల వ్యవస్థ:
విజయనగర రాజుల కాలంలోనే పాళెగాళ్ల వ్యవస్థ ఏర్పడింది. విజయనగర ప్రభువులు సా.శ.15వ శతాబ్దిలో ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలను సంరక్షించేందుకు పాలెగాళ్లను నియమించారు. అయితే 1565లొ తళ్ళికోట యుద్దంలో రామ రాయలు ఓటమితో విజయనగర సామ్రాజ్యం యొక్క పతనం ప్రారంభం అయ్యి, 1646 వరకు పూర్తిగా అంతరించి పోయింది. ఆ తరువాత ఇప్పటి రాయలసీమ ప్రాంతం నిజాం మరియు ఇతర నవాబుల పాలనలోకి వచ్చింది. 1782లో టిప్పుసుల్తాన్ పాలన మొదలైన తరువాత ఈ ప్రాంతం టిప్పుకు, నిజాం రాజుకు మధ్య ఆదిపత్య పోరులో నలిగింది.
అనంతపురం, రాయదుర్గం, చిత్తూరు గుర్రంకొండ టిప్పు స్వాదీనం చేసుకున్నాడు. అయితే మరో వైపు ఇండియాలో “ఈస్ట్ ఇండియా” కంపెనీ ఆదిపత్యం బాగా పెరిగింది. వీరు టిప్పు సుల్తానుతో యుద్ధం చేసి మొదట ఓడినా ఆ తరువాత గెలిచారు. దానితో టిప్పు సుల్తాన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒప్పందం వల్ల రాయలసీమ ప్రాంతాన్ని “నిజాం” కు ఇచ్చాడు. 1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో జరిగిన యుద్దంలొ టిప్పు సుల్తాన్ మరణించాడు. దాంతో దక్షిణాదిలో నిజాం మాత్రమే బలమైన రాజుగా ఉన్నాడు. టిప్పు చనిపోవడంతో ఈస్ట్ ఇండియా వారికి యుద్దాలు చేయాల్సిన అవసరం లేకపోయింది.
అయితే నిజాంకు బ్రిటిష్ వారి “ఆయుధ” మద్దతు అవసరం ఉండటంతో 1800లో రాయలసీమను ఈస్ట్ ఇండియా కంపినీకి నిజాం రాసిచ్చాడు. అలా రాయలసీమలో బ్రిటీష్ వారి అధికారం ప్రారంభమైంది. దానికి “థామస్ మన్రో” కలెక్టరుగా వచ్చారు. మన్రో రాయలసీమలొ బ్రిటీష్ వారికి పన్నుల వసూలు చేయడంతో అతనికి “పాలెగాళ్ళ” నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది. కాకతీయ రుద్రమ పరిపాలనలో ప్రారంభం అయిన “నాయకుల” వ్యవస్థకు విజయనగర పాలేగాళ్ల వ్యవస్థ కూడా జత చేయబడింది.
పాలెగాళ్ళు బ్రిటిష్ వాళ్లను ఎదిరించే నాటికి 350 ఏళ్ల నుండి కొండ మార్గాల్లో కోట్లు, దుర్గాలు, బురుజులు నిర్మించుకుని నివాసముంటూ ప్రజల రక్షణ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేసినందుకు పాలెగాళ్లను బ్రిటిష్ ప్రభుత్వం బందిపోట్లు అని నిందించింది. నిజాం బ్రిటిష్ గవర్నర్ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార’ పద్ధతికి పెట్టిన షరతుల్లో రాయలసీమను ఇవ్వడంతో రాయలసీమ మొత్తం కోపం ఊగిపోయింది. ఎనబై మంది పాలెగాళ్లు 33,000 మంది సైనికులతో కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని ముప్పు తిప్పలు పెట్టారు.
సా.శ.1801 నుంచి 1806 వరకు చిత్తూరు పాలెగాళ్లు బ్రిటిష్ వారికి ఎదురించి నిలబడ్డారు. ఈ పోరాటాలలోబ్రిటిష్‌వారు యాదరకొండ పాలెగాడు రామప్ప నాయుడిని సా.శ.1804లో ఉరి తీశారు. ఆ తరువాత బంగారు పాళ్యం పాలెగారు, చారగళ్లు పాలె గాళ్లను ఉరితీశారు. మిగిలిన పాలె గాళ్లను ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రిటీషు ప్రభుత్వం పాలేగాళ్ల ఆస్తులు, మాన్యాలను ఆక్రమించుకోవడం కోసం పాలెగాళ్ళ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఇవ్వడం మొదలుపెట్టింది.
వీరపాండ్య కట్టబ్రహ్మన:
18శతాబ్దానికి చెందిన వీరపాండ్య కట్టబ్రహ్మన స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతను పాలెగాళ్ళలో ఒకడు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని కాదని వారిపై తిరుగుబాటు చేసాడు. 1799లొ తమిళనాడులో కట్ట బ్రహ్మన్నను యుద్దంలో ఓడించి 39 ఏళ్ళ వయస్సులో సా.శ. 1799లో అక్టోబరు 16వ తేదీన బ్రిటిష్ వారు ఉరి తీసారు. కట్ట బ్రహ్మన్నను చంపటం బ్రిటిష్ వారు పాలెగాళ్ళ వ్యవస్థను నిర్మూలించటం కోసం.
నరసింహారెడ్డి తిరుగుబాటు:
నరసింహారెడ్డి తాతగారు, జయరామిరెడ్డి సంతానం లేక చనిపోయాడనే నెపంతో అప్పటి వరకు ఇస్తూన్న భరణాన్ని బ్రిటిషు ప్రభుత్వం రద్దు చేసింది. భరణం నిలిచిపోవడంతో నరసింహారెడ్డి రావలసిన భరణం కోసం కోయిలకుంట్ల తహసిల్దారు వద్దకు తన సైనికుడిని పంపాడు. ఆ తహసిల్దారు భరణం ఇవ్వకుండా నరసింహారెడ్డిని తిట్టి పంపించడంతో ఆ భటుడు నరసింహారెడ్డికి జరిగిన విషయం తెలిపాడు. నరసింహారెడ్డి అటువంటి అవమానం బ్రతకడం కంటే చావే మేలని భావించి, అదే భటునితో తహసిల్దారుకు తాను వస్తున్నట్టుగా కబురు పంపాడు.
మాన్యాలు, ఆస్తులు పోగొట్టుకున్న ఇతర పాలేగాళ్ళు రెడ్డి నాయకత్వంలో చేరారు. వీరిలో వనపర్తి, జటప్రోలు, మునగాల, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్,పెనుగొండ, అవుకు జమీందార్లు, కొందరు చెంచులు, బోయలు కూడా ఉన్నారు. 1846 జూన్ నెలలో నరసింహారెడ్డి తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. చాలా నెలలపాటు బ్రిటిష్ వారితో గెరిల్లా యుద్దం చేశాడు. ఆఖరికి 1847లొ నరసింహారెడ్డిని బ్రిటీష్ వాళ్ళు బంధించి ఊరి బహిరంగంగా ఆయన ఉరి తీశారు.
ఇది తంగిరాల వెంకట సుబ్బారావుగారు రాసిన “రేనాటి సూర్యచంద్రులు” అనే గ్రంధంలో కనిపిస్తుంది. నరసింహారెడ్డి వీరత్వాన్ని కీర్తిస్తూ ఇప్పటికీ జానపదులు, ఉగ్గుకథలు, గేయాలు, పాటల రూపంలో వివరిస్తారు. ఆయన ఆనవాళ్ళు కోయిలకూట ప్రాంతంలో కనిపిస్తాయి. స్థానికులు కూడా ఆయన వీరచరితను కథలుకథలుగా చెప్పుకుంటుంటారు.
Also Read: ఈ “కోట” వల్ల అప్పుల పాలు అయ్యారా..? అసలు ఎందుకు కట్టారు..?