అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన బుజ్జి అండ్ భైరవ ఎలా ఉంది..? ప్రభాస్ తో పాటు ఆ నటుడు కూడా..?

అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన బుజ్జి అండ్ భైరవ ఎలా ఉంది..? ప్రభాస్ తో పాటు ఆ నటుడు కూడా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2898 ఏడీ సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదల అవ్వడానికి ఇంకా కొద్ది రోజులు ఉంది. దాంతో సినిమా బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్ అంటే ఏదో ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు. సినిమా బృందం చాలా కొత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ నిర్వహించి, అందులో బుజ్జిని పరిచయం చేశారు. బుజ్జి భైరవకి చాలా మంచి ఫ్రెండ్ అని చూపించారు. బుజ్జి పాత్రకి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు బుజ్జి సినిమాలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది.

Video Advertisement

 bujji and bhairava amazon prime

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో భైరవ బుజ్జి అని ఒక చిన్న సిరీస్ లాంటిది విడుదల చేశారు. ఇది కూడా సినిమాకి సంబంధించినదే. సినిమాకి సంబంధించిన పాత్రలు ఇందులో కనిపిస్తున్నారు. బ్రహ్మానందం, టీజర్ లో కనిపించిన పశుపతి, సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించిన అన్నా బెన్, వీళ్ళందరితోపాటు ప్రభాస్, అంటే భైరవ, బుజ్జి కూడా కనిపిస్తున్నారు. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. సిరీస్ స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా ఇందులో కనిపిస్తోంది. ఒకవేళ సినిమా ఇలాగే ఉంటే మాత్రం హిట్ అవ్వడం గ్యారెంటీ అని అందరూ అంటున్నారు.

రెండు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ఒక్కొక్కటి 14 నిమిషాల నిడివి ఉంది. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమ్ అవుతోంది. చాలా ఆసక్తికరంగా ఈ సిరీస్ రూపొందించారు. దీంతోనే సినిమాకి కనెక్షన్ కూడా ఇచ్చారు. ఈ సిరీస్ చివరిలో కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని కూడా ఇచ్చారు. అంటే కల్కి సినిమాకి ఇంకా భాగాలు ఉంటాయి అని కూడా ప్రకటించారు. ఇది చూశాక సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. మొన్నటి వరకు చాలా మంది కామెంట్స్ చేశారు. ఎందుకంటే సినిమా నుండి ప్రమోషన్స్ లేవు.

కానీ ఇప్పుడు వారానికి ఒక కొత్త ప్రమోషనల్ వీడియోతో మన ముందుకి వస్తున్నారు. మిగిలిన సినిమాలతో పోలిస్తే, కల్కి సినిమా టీం ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. సినిమా యూనివర్సల్ గా రిలీజ్ అవుతోంది. కాబట్టి అందరికీ చేరేలా కొత్త కొత్త ప్రమోషన్ స్ట్రాటజీస్ డిజైన్ చేశారు. సినిమా బృందంతో కూడా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.


End of Article

You may also like