ఆడవారికి సహజంగానే భక్తి అనేది ఎక్కువగా వుంటుంది. పూజ కోసం వారు చేసే ఏర్పాట్లు, భగవంతుడిని పూజించడం కోసం పూవ్వులు కోయడం, మాలగా కట్టి సమర్పించడంలో మహిళలు చాలా సంతోషాన్ని పొందుతుంటారు. తరచుగా పూజలు, అభిషేకాలు చేయించడం కోసం తోటి మహిళలతో కలిసి దగ్గరలో ఉండే దేవాలయాలకి వెళుతూ వుంటారు.

Video Advertisement

ఇక శ్రావణ మాసం, కార్తీక మాసంలో అయితే పెళ్లి అయిన మహిళలు పూజలు, వ్రతాలలో నిమగ్నులై వుంటారు. అయితే భర్త లేని ఆడవారు పూజలు, నోములు, వ్రతాల వంటివి చేసుకోవచ్చా? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
పెళ్లి అయిన మహిళలు పూజలు, వ్రతాలు చేస్తూ, దేవుడిని కొలుస్తూ ఉంటారు. అయితే పెళ్లి అయిన స్త్రీలు భర్తను కోల్పోయిన తరువాత వారిని శుభకార్యాలకు, పూజలకు దూరంగా ఉండాలని కొందరు అంటుంటారు. వితంతువులు పూజలు, వ్రతాలకు దూరంగా ఉంటారు. అయితే శాస్త్ర ప్రకారం, భర్తలేని మహిళలు పూజలు చేయకూడదు అనేది ఎక్కడా లేదు. భగవంతుడి పూజాకు ఎలాంటి తప్పు లేదా దోషం లేదని పండితులు చెబుతున్నారు.
అయితే పసుపు కుంకుమలు ఇవ్వడం, కొన్ని రకాల పూజలు అంటే భార్యాభర్తలు పీటల మీద కూర్చునే పూజలు తప్ప మిగతా పూజలకు, దేవుడిని పూజించడానికి ఎలాంటి తప్పు లేదు. కార్తీక పురాణంలో ఒక స్త్రీ భర్త, తండ్రి మరణించిన తరువాత కార్తీక వ్రతం చేసుకుందని, కార్తీక స్నానం చేసిందని, ఏకాదశి వ్రతం చేసిందని, విష్ణు పూజ చేసిందని, ఆ తరువాత కావేరీ నది స్నానం చేస్తుదాగానే మరణించి, మరుసటి జన్మలో ఆమె సత్యభామగా జన్మించిందని చెప్పబడిందని పండితులు చెప్పారు.
అందువల్ల భర్త లేని స్త్రీలు కార్తీక వ్రతం, మార్గశిర వ్రతం. ఏకాదశి వ్రతం, షణ్ముఖ దీపోత్సవం, కార్తీక దీపోత్సవం, వసంత పంచమి దీపోత్సవం, ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి పూజలకి గాని ఎలాంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు.

Also Read: గణపతి విగ్రహాల్లో తొండం కొన్నిటికి కుడివైపున, కొన్నిటికి ఎడమవైపున ఎందుకు ఉంటుంది..? వాటి అర్థమేమిటి?