డీహైడ్రేషన్ సమస్య ఉందో లేదో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!

డీహైడ్రేషన్ సమస్య ఉందో లేదో ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!

by Megha Varna

Ads

అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అదే విధంగా సరైన జీవన విధానాన్ని పాటిస్తూ ఉండాలి. వ్యాయామం చేయడం, మంచి నీళ్లు ఎక్కువగా తాగడం కూడా చాలా ముఖ్యం. చాలా మంది పనుల్లో పడి పోయి మంచి నీళ్లని తక్కువ తాగుతూ ఉంటారు.

Video Advertisement

మంచి నీళ్ళు తక్కువ తాగడం వల్ల ఇబ్బందులు వస్తాయి. శరీరానికి సరిపడా నీళ్లు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి.

అయితే చాలా మందికి అనుమానం ఉంటుంది. నేను నీళ్ళు ఎక్కువగా తాగుతున్నానా లేదా అని. అలానే నీళ్లు ఎక్కువగా తాగుతున్నామా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అని కూడా అనుకుంటారు. మీకు కూడా అలాగే అనిపిస్తోందా..? అయితే ఎటువంటి చింత వద్దు. ఈ విధంగా మీరు ఫాలో అయ్యారంటే మీరు డీహైడ్రేషన్ కు గురి అయ్యారా లేదా అనేది తెలుస్తుంది.

డీహైడ్రేషన్ సమస్య ఉంటే ఎన్నో సమస్యల్ని తీసుకు వస్తుంది. కాబట్టే డిహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇంతకీ మీరు డీహైడ్రేషన్ తో ఉంటున్నారా లేదంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నారా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మీ చేతి వేళ్ళ మధ్యలో ఉండే స్కిన్ ని మీరు ఒకసారి పైకి లాగండి. ఆ తర్వాత మీ స్కిన్ కనుక వేగంగా కిందకి వెళ్ళిపోతుంటే మీరు బాగానే ఉన్నారని అర్థం.

అదే ఒకవేళ మీరు మీ చర్మాన్ని లాగిన తర్వాత చర్మం చాలా నెమ్మదిగా కిందకి వెళుతూ ఉంటే అది ఖచ్చితంగా డీహైడ్రేషన్ సమస్య అని గుర్తించొచ్చు. తాజాగా డాక్టర్లు ఈ చిట్కాని షేర్ చేసుకున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు సులభంగా డీహైడ్రేషన్ కి గురయ్యార లేదా అని చెక్ చేసుకోవచ్చు.


End of Article

You may also like