DIABETES: డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగవచ్చా… తాగితే ఏమవుతుంది…?

DIABETES: డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగవచ్చా… తాగితే ఏమవుతుంది…?

by Mounika Singaluri

Ads

భారతదేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు డయాబెటిస్ వచ్చేస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలో సగటును 10 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కొంతమందికి వంశపారపర్యంగా వస్తుంటే మరి కొంతమందికి ఆహారాలవాట్లు వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారు ఆహారం నియమాలను ఖచ్చితంగా మార్చుకోవాలి. అయితే డయాబెటిస్ సోకినవారు మద్యం తాగవచ్చా? తాగితే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం…!

Video Advertisement

డయాబెటిస్ ఉన్నవారు అధికంగా మద్యం తీసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.అందుచేత ఈ రోగం ఉన్నవారు ఆహార నియమాలతో పాటు పానీయాలకు కూడా దూరంగా ఉండాలి. మద్యం ఎక్కువగా తాగే వాళ్లకు కూడా డయాబెటిస్ సోకుతుంది. ఒకవేళ ముందుగానే డయాబెటిస్ ఉంటే మద్యానికి దూరంగా ఉండాలి.
ఈ సమస్యను వారిలో నాడీ కణాలను దెబ్బతింటాయి. ఒకవేళ మద్యం తాగడం ఎక్కువైతే అది మరింత వేగంగా దెబ్బతినే అవకాశం ఉంది.

ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మద్యం తాగాల్సి వస్తే తర్వాత కొద్దిసేపటికి నిండుగా భోజనం చేసి తర్వాత షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఒకవేళ తాగిన తర్వాత తినకుండా మందులు వేసుకుంటే ఇవి కొత్త సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మద్యానికి దూరంగా ఉండటమే మంచిది.


End of Article

You may also like