అంజీర్, బీట్రూట్ జ్యూస్ ని తీసుకుంటే.. ఈ 4 సమస్యలు దూరం..!

అంజీర్, బీట్రూట్ జ్యూస్ ని తీసుకుంటే.. ఈ 4 సమస్యలు దూరం..!

by Megha Varna

Ads

ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. అనారోగ్య సమస్యలుకి దూరంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మనం తీసుకునే డైట్ లో కచ్చితంగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా అందేటట్టు చూసుకోవాలి. ఆరోగ్య నిపుణులు ఈరోజు మనతో కొన్ని చిట్కాలని పంచుకోవడం జరిగింది.

Video Advertisement

బీట్రూట్ అంజీర్ పండ్ల రసాలని కలిపి తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరసం, అలసట, కండరాలు నొప్పులు వంటి ఇబ్బందులు ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన రావు. అలానే అంజీర్ బీట్రూట్ రసాన్ని తీసుకోవడం వలన మరి కొన్ని ఇబ్బందులు నుండి కూడా దూరంగా ఉండొచ్చు. వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.

#1. రక్తహీనత సమస్య:

చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళు బీట్రూట్ అంజీర్ రసాన్ని తీసుకోండి ఇలా చేయడం వలన చక్కటి ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. క్యాల్షియం, ఐరన్ కూడా అందుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి.

#2. నీరసం, అలసట తగ్గుతుంది:

అంజీర్ బీట్రూట్ రసాన్ని తీసుకోవడం వలన హెమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగి రక్తహీనత సమస్య తొలగిపోతుంది. దీనితో నీరసం అలసట కూడా తొలగిపోతాయి.

#3. కండరాల నొప్పులు:

కండరాల నొప్పులతో బాధపడే వాళ్ళకి కూడా ఇది చక్కటి రిలీఫ్ ని ఇస్తుంది. అంజీర్, బీట్రూట్ రసాన్ని కలిపి తీసుకుంటే ఈ సమస్య కూడా ఉండదు.

#4. వ్యాధినిరోధక శక్తి :

వ్యాధినిరోధక శక్తిని ఇది పెంచుతుంది కూడా. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా దీనిని తీసుకోవచ్చు.

అంజీర్, బీట్రూట్ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి..?

బీట్రూట్, అంజీర్ ని కడిగేసుకుని వీటిని ముక్కలు కింద కోసుకొని మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత జ్యూస్ ని వడకట్టుకుని తేనె నిమ్మరసం వేసుకొని తీసుకోవచ్చు. నెల రోజులు పాటు ఇలా చేస్తే కచ్చితంగా రక్తహీనత తగ్గుతుంది.

 


End of Article

You may also like