2 ఇండ్ల మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని కొనవచ్చా…కొంటే వచ్చే సమస్యలు ఇవేనా..!!

2 ఇండ్ల మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని కొనవచ్చా…కొంటే వచ్చే సమస్యలు ఇవేనా..!!

by Sunku Sravan

Ads

సమాజంలో కొంతమంది ఎంతో కష్టపడి స్థలం కొనుక్కొని ఇండ్లను కట్టుకుంటారు. అలాంటి వారు కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఇబ్బందుల్లో పడతారు.. ముఖ్యంగా 2 ఇళ్ళ మధ్య ఉన్నటువంటి పొడవైన స్థలాన్ని కొనవచ్చా లేదా.. దాంతో మనకు కలిసి వస్తుందా లేదా..? ఒక ఉదాహరణ చూసుకుంటే అడవిలో పెద్ద పెద్ద చెట్ల మధ్య చిన్న మొక్కలు పెరగలేవు. అలాంటిదే ఇది కాబట్టి రెండు పెద్ద బిల్డింగ్ ల మధ్య

Video Advertisement

పొడవుగా ఉన్నటువంటీ స్థలాన్ని మనం కొనుగోలు చేసినట్లయితే ఎదుగుదల ఉండదు. మినిమం ఉండవలసిన స్థలం అనేది ఇల్లుకు తప్పనిసరిగా ఉండాలి. మనం ఇళ్లను కట్టుకునేది మనం పని చేసి ఇంట్లోకి రాగానే రెస్ట్ తీసుకోవడం కోసం, ఇల్లు కట్టుకున్న తరువాత మనకున్న సంపదను రెట్టింపు చేసుకోవడానికి తగ్గట్టుగా నిర్మించుకుంటాం. ఈ పొడవైన బిల్లింగ్ ల మధ్య మనం ఇల్లు కట్టుకున్నట్లు అయితే

మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. దీని వల్ల మన ఎదుగుదల కుంటుపడుతుంది. వాస్తు ప్రకారంగా ఇటువంటి స్థలాలు ఇబ్బందిపెడతాయి. అందరూ అంటున్నారు కదా.. కట్టుకుంటున్నారు కదా అని మనం కూడా కొంటె ఇది కొంతమందికి కలిసి వస్తుంది మరి కొంతమందికి అస్సలు కలిసి రాదు. అటువంటి స్థలాల్లో వ్యాపారాలు పెట్టాలనుకుంటే దాన్ని వాస్తుకు అనుగుణంగా

మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇరుకైన స్థలాలు మాత్రం గృహ నిర్మాణానికి ఉపయోగపడవు. ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలాలు ఏంటంటే ఎక్కువగా స్కైర్ ఉన్న ప్లేసెస్ ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు అక్కడ తూర్పు వైపు మరియు ఉత్తరం వైపు తక్కువగా ఉండేలా చూసుకోవాలి, దక్షిణం, పడమర వైపు ఎత్తు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మనం ఇల్లు కట్టుకోవాలంటే ఈ విధమైన స్థలాలను ఎంచుకోవాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.


End of Article

You may also like