Ads
గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోవడంతో చాలా మంది సిలిండర్ ని ఆదా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. నిత్యావసర వస్తువుల్లో ఇది ఒకటి కనుక ధరలు మండిపోతున్న కొనడం తప్పడం లేదు. మీరు కూడా మీ సిలిండర్ ని ఆదా చేసుకోవాలని అనుకుంటున్నారా..? ఇలా చేస్తే 363 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా మండిపోవడం వలన సామాన్యులకి కష్టంగా ఉంటోంది. అయితే ఇక్కడ ఉన్న పద్ధతిని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సిలిండర్ పై 363 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఎల్ఫీజి సిలిండర్ కి బదులుగా పీఎన్జీ సిలిండర్ వాడితే మీ యొక్క డబ్బులని ఆదా చేసుకోవచ్చు. పైప్డ్ నేచురల్ గ్యాస్ ను ఉపయోగించడం వల్ల తక్కువ పడుతుంది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే వేయి రూపాయలకు చేరుకుంది… పీఎన్జి విషయానికి వస్తే.. ప్రస్తుత లెక్కల ప్రకారం.. స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ కు 35 రూపాయల 61 పైసలుగా ఉంది. అదే కేజీల ప్రకారం చూసుకుంటే కేజీకి 45 రూపాయలు అవుతుంది. అంటే 14.2 కేజీలకు చూసుకున్నట్లయితే 639 రూపాయలు అవుతుంది.
అయితే మీరు ఎల్ఫీజి కాకుండా పీఎన్జీ సిలిండర్ ను ఉపయోగిస్తే 363 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. పీఎన్జి సిలెండర్లని అందుబాటులోకి తీసుకు రావడానికి కేంద్రం కూడా ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ కనుక ఇవి అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా 363 రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
End of Article