Ads
అరటిపండు లో ఉన్న ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే అసలు ఈ రోజు నుంచి మీరు అరటి పండుని తినడం మీ జీవనశైలిలో ఒక భాగంగా చేసుకుంటారు…. అవేమిటో తెలుసా…
Video Advertisement
చక్కని పసుపు రంగులో అందమైన ఆకారంలో నోరూరించే అరటి పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎన్నో రకాల పోషక విలువలకు, పీచు పదార్థానికి అరటిపండు పెట్టింది పేరు.కానీ ఈ అరటి పండ్ల లో ఎన్నో రంగులు ఎన్నో రకాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.
పచ్చగా అందంగా ఉండే అరటిపండు మీద ఒక్క రవంత నల్లటి మచ్చలు వచ్చిన అవి తినడం హానికరమని చాలా మంది నమ్ముతారు.
మరి మచ్చలు ఉన్న అరటి పండు తింటే నిజంగానే ఏదైనా అవుతుందా…. తెలుసుకుందాం రండి.
సహజ పోషకాల నిలువైన అరటిపండు చాలా సులువుగా జీర్ణం అవుతాయి.అరటి పండ్లు మాగిన కొద్దీ వాటి మీద నల్లని లేదా గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. అంతమాత్రాన అవి కుళ్ళయనో, తినడానికి పనికిరావు అన్నట్టు భావించకూడదు అని నిపుణుల అభిప్రాయం.
ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అరటిపండు మీద ఏర్పడే ఈ నల్లని మచ్చలు టీ ఎన్ ఎఫ్ ఫ్యాక్టర్ ని సూచిస్తాయి. అంటే ట్యూమర్ నికోసిన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది మన రక్తంలోని క్యాన్సర్ కణాలు నియంత్రించడానికి వాటితో పోరాడడానికి తోడ్పడుతుంది.
బాగా మాగిన అరటిపళ్లలో ఎన్నో ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మన శరీరంలోని రోదనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఎన్నో రకాల బ్యాక్టీరియాతో పోరాడేటటువంటి శక్తిని మనకు అందిస్తాయి.
అరటి పండ్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాక పేగులను శుభ్రంగా ఉంచడానికి కూడా సహాయం చేస్తాయి.అరటిపండు లో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇవే కాక అరటిపండు వల్ల మన శరీరానికి పొటాషియం, విటమిన్ సి, విటమిన్ b6 ,మెగ్నీషియం తో పాటు మాంగనీస్, రాగి బయోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. మరింకెందుకు ఆలస్యం రోజుకు ఒక అరటి పండు తిందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
End of Article