Ads
మోసాలకు ఈరోజుల్లో అదుపు లేకుండా పోతోంది. చాలా రకాల స్కాములు మనం చూసే ఉంటాం. అయితే ఏటీఎం లో జరిగే మోసాలు గురించి కూడా తప్పక తెలుసుకోవాలి. అయితే మరి ఏటీఎంలో ఎలాంటి మోసాలు జరుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
మనం ఏటీఎం కి వెళ్ళినప్పుడు ఏటీఎం మిషన్ కాస్త హ్యాంగ్ అయినట్టు అవుతుంది. అప్పుడు వెనుక ఉండే వ్యక్తి సహాయం చేస్తానని మళ్లీ కార్డుని పెట్టి పిన్ ని ఎంటర్ చేయమని చెప్తాడు. సహాయం చేశారు కదా అని అనుకుంటూ ఉంటాము. తర్వాత డబ్బులు తీసుకుని మనం వెళ్ళి పోతూ ఉంటాము. ఆ తర్వాత చూస్తే ఖాతా ఖాళీ అయిపోతుంది.
ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఏటీఎంలోకి రాకముందే వాళ్ళు కొన్ని బటన్స్ ని ప్రెస్ చేసి ఎటిఎం మిషన్ ని హ్యాంగ్ చేస్తారు. కాసేపటికి అది పని చేయడం మొదలు పెడుతుంది. అయితే వాళ్లు కార్డు తీసుకుని స్వైప్ చేసి మన కార్డు మనకు ఇవ్వకుండా ఏదో కార్డు చేతిలో పెడతారు. ఇది ఒక రకమైన స్కామ్.
మరొక రకమైన స్కామ్ ఏమిటంటే ఏటీఎం మిషన్ బాగానే పనిచేస్తూ ఉంటుంది. మనం పిన్ కూడా ఎంటర్ చేస్తూ ఉంటాం. ఇంక ఎమౌంట్ ఎంటర్ చేసి తీసుకోవడమే. అటువంటి సమయంలో వెనక ఉన్న వ్యక్తి గట్టిగా ఏదైనా బటన్ ప్రెస్ చేసి ఇది పని చేయట్లేదు అని అంటాడు. ఆ తర్వాత ఆ పక్కన ఉన్న ఏటీఎం కి వెళ్ళమని అంటాడు. ఈ వ్యక్తి మాత్రం టైం అవుట్ అవ్వకుండా అందులో నుంచి డబ్బులు తీసుకుంటాడు.
అలాగే ఒక సారి మనం డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పిన్ ఎంటర్ చేసి ఆ తర్వాత అమౌంట్ ని కూడా ఎంటర్ చేస్తూ ఉంటాం. అయితే ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు వస్తున్న సౌండ్ కూడా వస్తుంది. కానీ డబ్బులు మాత్రం కనబడవు. కాసేపు చూసి మనం వెళ్ళి పోతూ ఉంటాం. ఆ తరవాత మరొక వ్యక్తి మిషన్ నుంచి వచ్చిన డబ్బులు తీసుకుంటాడు.
ఇక్కడ మోసం ఎలా చేశాడంటే అమౌంట్ వచ్చే దగ్గర ఒక బాక్స్ ని అడ్డంగా ఫిక్స్ చేసి ఉంచుతాడు. దీని వల్ల ఏమవుతుంది అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి తెలియదు. క్లోజ్ చేసిన ఆ బాక్స్ ని తీసేసి అతను డబ్బులు తీసుకుంటాడు. అలానే స్లిప్ వచ్చే ప్రదేశంలో ప్లాస్టర్ అంటిస్తాడు. ఆ తర్వాత ప్లాస్టర్ ని కూడా తీసేసి స్లిప్ ని తొలగిస్తాడు. ఇది కూడా ఒక రకమైన స్కామ్.
End of Article