జీడిపప్పు చాలా రుచికరంగా ఉంటుంది అందుకే అందరూ తినేందుకు ఇష్టపడుతుంటారు. జీడిపప్పుని ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకుని చాలా మంది తింటూ ఉంటారు. అలానే కూరల్లో వాటిల్లో కూడా వేసుకుంటూ ఉంటారు. జీడిపప్పును ఇష్టపడని వాళ్ళు వుండరు. కానీ జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండడం వలన చాలామంది జీడిపప్పుని తినకుండా దూరం పెడుతూ ఉంటారు.

Video Advertisement

జీడిపప్పు వలన హృదయ సంబంధిత సమస్యలు వస్తాయా..?

హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాలని జీడిపప్పు తీసుకోరు కానీ నిజానికి జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది ఇది హృదయ సంబంధిత సమస్యలను తీసుకురాదు. అయితే కొవ్వు కొలెస్ట్రాల్ కొవ్వు రెండు వేరువేరు. 100 గ్రాముల జీడిపప్పులో 47 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొలెస్ట్రాల్ కాదు.

జీడిపప్పును ఎవరు తినకూడదు..? ఎవరు తినొచ్చు..?

#1. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు జీడిపప్పును తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే జీడిపప్పులో కొవ్వు ఎక్కువ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే జీడిపప్పు పనికిరాదు. ఒకవేళ తిన్నా చాలా కొంచెం తినాలి.
బరువు తగ్గాలని చూసేవారు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తీసుకోకూడదు.

#2. జీడిపప్పులో కార్బోహైడ్రేట్స్ ఉండవు. కనుక షుగర్ ఉండే వాళ్ళు తీసుకున్నా పరవాలేదు. అయితే షుగర్ ఉండే సన్నగా ఉండే వాళ్ళు సామర్థ్యాన్ని పొందడానికి జీడిపప్పును తీసుకోవచ్చు.

#3. కండ పట్టడానికి వ్యాయామం చేసేవారు, ఆటలు ఆడుకునే పిల్లలు ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు.

#4. వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం ప్రయత్నం చేసేవారు జీడిపప్పును ఎక్కువగా తీసుకోవచ్చు.

#5. గర్భిణీలు బాలింతలు కూడా జీడిపప్పును ఎక్కువగా తీసుకోవచ్చు.

#6. ఎక్కువ పని చేసే వారు కూడా జీడిపప్పుని ఎక్కువగా తింటూ ఉండొచ్చు.

#7. తేలికగా అరుగుతుంది కాబట్టి వృద్ధులు కూడా తీసుకోవచ్చు.

జీడిపప్పుని తీసుకోవడానికి మంచి పద్ధతి..?

సాధారణంగా ఎక్కువ మంది జీడిపప్పుని వేయించి ఉప్పు,కారం వేసుకుని తింటూ ఉంటారు. అలా కాకుండా జీడిపప్పుని నీళ్లలో కాసేపు నానబెట్టి.. నానబెట్టిన జీడిపప్పును తీసుకుంటే లభ్లను పొందొచ్చు. ఇలా చేయడం వలన త్వరగా జీర్ణం అవుతుంది కూడా. పైగా జీడిపప్పులో వుండే పోషకాలను మీరు పొందాలంటే కచ్చితంగా నానబెట్టుకుని తీసుకోవాలి.