Yashoda OTT release: సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. యశోద సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.
నవంబరు 11న విడుదలైన యశోద తొలి రోజే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని రూ.30 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి లాభాలను రాబట్టింది. ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లని రాబట్టింది. సరోగసీ అనే సున్నితమైన అంశం పై తెరకెక్కిన ఈ సినిమాకి హరి, హరీష్ డైరెక్షన్ చేశారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా చేసింది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.
యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్‌తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్‌కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.


ఈమధ్య కాలంలో మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాల్లో ఉండటం కూడా ఈ మూవీ పై ప్రభావం చూపిందని అంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ మూవీగా నిలిచిన జిన్నా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీకి దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో రఘు బాబు, అన్నపూర్ణమ్మ, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, చమ్మక్ చంద్ర, తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఇక అమెజాన్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొంచెం సందేహం వచ్చిన రీషూట్స్,రీ ఎడిటింగ్స్, డిస్కషన్స్ లాంటివి తప్పకుండా చేస్తారు. అయితే ‘దూత’వెబ్ సిరీస్ విషయంలోనూ అలాంటిదే జరుగుతోందని తెలుస్తోంది. అదీ కాకుండా ప్రస్తుతం దర్శకుడు విక్రమ్, నాగచైతన్య ఫామ్ లో లేరు. ఇద్దరు థాంక్యూ సినిమాతో చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అందువల్ల ‘దూత’వెబ్ సిరీస్ ని విడుదల చేయడం వల్ల బజ్ ఉండకపోవచ్చని అమెజాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య నటించే సినిమా ఏదైనా హిట్ అయిన్నప్పుడు కానీ, ‘దూత’ పై మంచి బజ్ వచ్చాక కానీ ఈ సిరీస్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ లో కంటెంట్ కి సమస్య లేదు. దాంతో ఈ వెబ్ సిరీస్ ను హోల్డ్ లో ఉంచారని సమాచారం. అయితే అమెజాన్ సంస్థ ఈ సిరీస్ విడుదల అవనప్పటికి ‘దూత2’ కోసం స్క్రిప్ట్ రాయమని విక్రమ్ కుమార్ ని కోరిందని తెలుస్తోంది. అంటే దూత రెండవ సీజన్ కూడా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది. నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’అనే మూవీలో నటిస్తున్నారు.
కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య షోకు 5వ ఎపిసోడ్ కు ఆహా ఫౌండర్స్ లో ఒకరైన అల్లు అరవింద్, తెలుగు దర్శకులలో గొప్పగా చెప్పుకునే కె రాఘవేంద్రరావు, టాప్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు వస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ ఎపిసోడ్ లో సినీ రంగం గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అన్ స్టాపబుల్ షో కోసం ఇరవై నుండి ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు షో నిర్వాహకులు.
ఆహా ఓటీటీకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగడంతో, అది బాలకృష్ణ షో వల్లే ఆహా సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని అంటున్నారు. బాలకృష్ణ కూడా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య షో వల్లే ఆహా రేంజ్ ను పెరిగిందని కొందరు అంటున్నారు. అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్న క్రమంలో ప్రతి ఎపిసోడ్ ని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక అందులో భాగంగా రాబోయే ఎపిసోడ్స్ ని మరింత గ్రాండ్ గా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు.






















