Ads
Tollywood: డైరెక్టర్ మోహన్ రాజా డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదలై, మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అభిమానులకు నచ్చిందనే సంగతి అందరికీ తెలిసిందే. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చి, ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు.
Video Advertisement
మలయాళంలో వచ్చిన లూసీఫర్ మూవీకి రీమేక్‌గా రూపొందిన దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కింది గాడ్ ఫాదర్ మూవీ. కానీ తెలుగులో వచ్చిన లూసిఫర్ సినిమాను చూసినవారు గాడ్ ఫాదర్ మూవీని థియేటర్ లో చూడటానికి ఆసక్తి చూపలేదు. దాని ఫలితంగా గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అదే గాడ్ ఫాదర్ సినిమా ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ లో కొద్ది రోజులుగా స్ట్రీమింగ్ అవుతూ టాప్3 లో ట్రెండ్ అవుతోంది.అయితే థియేటర్లలో యావరేజ్ సినిమాగా నిలిచిన గాడ్ ఫాదర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారని నెటిజన్ల కామెంట్లుచెప్తున్నాయి.మెగాస్టార్ సినిమాలకు ప్రేక్షకులలో క్రేజ్ తగ్గలేదని చెప్పేందుకు ఇదే సాక్ష్యం అని మెగా ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలవగా, ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఇక తమ హీరో చిరంజీవి వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ముఠామేస్త్రి సినిమా తర్వాత అలాంటి పాత్రలో చిరంజీవి నటిస్తుండటంతో అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.చాలాకాలం తరువాత చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
End of Article