సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘బిజినెస్ మెన్’ మూవీ కూడా ఒకటి. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. ఈ చిత్రం మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజ్ కానుంది.
పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో మహేష్ బాబుని డిఫరెంట్ పాత్రలో చూపించాడు. ఈ చిత్రంలో మహేష్ బాబుకి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో కాజల్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి ఎవరు? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘బిజినెస్ మెన్’ మూవీ మహేష్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు డైలాగ్ లు, యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ చాలా ఆకట్టుకున్నాయి. గత ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ రీరిలీజ్ అయ్యింది. అప్పుడు మొదలైన రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసగుతూనే ఉంది. ఇక ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బిజినెస్ మెన్’ రీరిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంట. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1.36 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కే ఈ రేంజ్ లో వసూలు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో డబ్బు, స్టేటస్ అంటే చాలా ఇష్టపడే పాత్రలో నటించిన అమ్మాయి పేరు ఆయేషా శివ. ఈమె కెనడాలో జన్మించిన భారతీయ నటి.
ఈ మూవీలో తన డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఆయేషా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. అలా బాలీవుడ్ మూవీలో చూసి, పూరీ జగన్నాథ్ ఆయేషాను ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసాడు. బిజినెస్ మెన్ మూవీ తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటించలేదు. రీసెంట్ గా ఆయేషాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
https://www.instagram.com/p/Cvk48lxvaOC/
Also Read: ఎవరు ఈ సెలబ్రిటీ స్పందన విజయ్ రాఘవేంద్ర..? ఆమె హఠాన్మరణానికి కారణం ఏంటి..?

కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ మరణ వార్త తెలిసి, ముందుగా పద్ధతిగా ఆయన మరణానికి బాధపడుతూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికి ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో గద్దర్ ఫ్యాన్స్ కరాటే కళ్యాణి పై మండిపడ్డారు.
‘మనిషి మరణిస్తే ఇలాంటి పోస్ట్ చేస్తావా? అందువల్లే కదా అందరూ నిన్ను తిట్టేది.. పోయినవాళ్ళని తిట్టడానికి ఎలా మనసు వస్తుంది. నువ్వు అసలు మనిషివేనా? అని ఓరేంజ్‌లో ఆగ్రహిస్తున్నారు. అయితే గద్దర్ అభిమానులు చేస్తున్న కామెంట్లపై కరాటే కళ్యాణి స్పందిస్తూ ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టింది. ఆ లైవ్ లో గద్దర్ పాటల పై, గద్దర్ కుమారుడి పై వివాదాస్పద కామెంట్స్ చేసింది. గద్దర్ పాటలతో ఎంతోమంది ప్రభావితం అయ్యి, అడవిబాట పట్టారు. అంతమంది అడవిదారి పడితే, మరి గద్దర్ కుమారుడు అమెరికాలో ఉన్నారు.
తాను అయితే ఏ విషయం అయినా మొదట మనం పాటించి, ఆ తరువాత అమలు పరచాలని భావిస్తాను. కానీ గద్దర్ అందర్నీ అడవిదారి పట్టించి, తన కుమారుడిని మాత్రం అమెరికాకు పంపించారు. సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్లన్ని అందరికీ నచ్చనవసరం లేదు. అందరికి నచ్చేలా పోస్ట్‌లు పెట్టలేం, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం తన పద్దతిని మార్చుకోనని, ఎవరు తిట్టినా పట్టించుకోనని, తన పోస్ట్‌లు తన ఇష్టం అని చెప్పుకొచ్చారు.
హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలని ఒకే చేస్తూ, ఆ చిత్రాలలో నటిస్తూ ఉత్సాహంగా కొనసాగుతున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత చిరంజీవి పలు చిత్రాలలో నటించినప్పటికీ, వాటిలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సాధించింది. మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ ‘వేదాళం’ కు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఆదివారం (ఆగస్టు 6న) ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ 2 రోజుల క్రితమే సెన్సార్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ నిడివి రెండు గంటల 39 నిమిషాల 49 సెకెన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ‘భోళా శంకర్’ సినిమాకి సెన్సార్ బోర్డు జారీ చేసిన రిపోర్టు బయటకు వచ్చింది. ప్రధానంగా ఈ చిత్రంలో మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలకు వచ్చే సమయంలో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికను హైలైట్ చేశారు. అదే కాకుండా డ్రగ్స్ సన్నివేశాల సమయంలోనే కూడా ఇలాంటి హెచ్చరికను పెట్టించారు.
అంతేకాకుండా ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందుగా వచ్చే సన్నివేశంలో హీరో చిరంజీవి విలన్ తలను నరకడం హింసాత్మకంగా ఉందని, 6సెకెన్లు ఉన్న ఈ సీన్ కట్ చేశారు. ఈ సీన్ ప్లేస్ లో చిరంజీవి, తమన్నా క్లోజప్ షాట్‌ను జతపరిచారు. అలాగే ఇటీవల దసరాలో కూడా ఉన్న ఒక పదంతో వచ్చే డైలాగును సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేయించారని రిపోర్టులో చూపారు.
ప్రజా గాయకుడిగా గద్దర్ ఎన్నో స్టేజ్ ల మీద పాటలు పడుతూనే, మారో వైపు ఉద్యమ చిత్రాలకు పాటలు కూడా రాశారు. అలా సినిమాలలోని ఉద్యమ పాటల ద్వారా గద్దర్ త్వరగా ప్రజలకు చేరువయ్యారు. వాటిలో ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు, నటుడు మరియు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రాలకు ఆయన ఎక్కువగా సాంగ్స్ రాశారు.
1. బండెనక బండి కట్టి – మా భూమి:
2007లో హీరో విజయ్ రాఘవేంద్ర, స్పందన వివాహం జరిగింది. స్పందన బెంగళూరు మాజీ పోలీస్ ఆఫీసర్ బీకే శివరామ్ కుమార్తె. ఈ జంటకి కుమారుడు శౌర్య ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు కన్నడ పరిశ్రమలో భారీగా అభిమానులు ఉన్నారు. స్పందన 2016లో రిలీజ్ అయిన ‘అపూర్వ’ అనే కన్నడ చిత్రంతో పాటు పలు చిత్రాలలో నటించారు. అంతేకాకుండా భర్త విజయ్ రాఘవేంద్ర సినిమాలకు నిర్మాతగా స్పందన పలు సినిమాలను సైతం నిర్మించింది.
రీసెంట్ గా ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్ టూర్‌కు వెళ్లిన స్పందన ఈరోజు (సోమవారం) ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆమెను హాస్పటల్ కి తరలించేలోపే స్పందన మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 19 రోజుల్లో విజయ్ రాఘవేంద్ర, స్పందనల 16వ వివాహ వార్షికోత్సవం రానుంది. ఈ లోపే స్పందన మరణించడం అందరినీ కలచివేస్తోంది. స్పందన భౌతికకాయం మంగళవారంలోగా బెంగళూరుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. స్పందన మరణం తీవ్రంగా కలచివేస్తోందని విజయ్ రాఘవేంద్ర సన్నిహితులు సామాజిక మధ్యమలలో పోస్టులు పెడుతున్నారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ హీరో అయిన విజయ్ రాఘవేంద్ర దాదాపు 50 చిత్రాలకు పైగా నటించారు. 20కు పైగా సాంగ్స్ ను పాడారు. ప్రస్తుతం ఆయన పలు టెలివిజన్ షోలలోని డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.


































