మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. హీరోయిన్ కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న ఈ మూవీలో సుశాంత్, రష్మీ గౌతమ్,శ్రీముఖి ముఖ్యమైన పాత్రలలో నటించారు.
ఆగస్ట్ 11న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ మూవీ సెన్సార్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలని ఒకే చేస్తూ, ఆ చిత్రాలలో నటిస్తూ ఉత్సాహంగా కొనసాగుతున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత చిరంజీవి పలు చిత్రాలలో నటించినప్పటికీ, వాటిలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సాధించింది. మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ ‘వేదాళం’ కు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఆదివారం (ఆగస్టు 6న) ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ 2 రోజుల క్రితమే సెన్సార్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ నిడివి రెండు గంటల 39 నిమిషాల 49 సెకెన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ‘భోళా శంకర్’ సినిమాకి సెన్సార్ బోర్డు జారీ చేసిన రిపోర్టు బయటకు వచ్చింది. ప్రధానంగా ఈ చిత్రంలో మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలకు వచ్చే సమయంలో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికను హైలైట్ చేశారు. అదే కాకుండా డ్రగ్స్ సన్నివేశాల సమయంలోనే కూడా ఇలాంటి హెచ్చరికను పెట్టించారు.
అంతేకాకుండా ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందుగా వచ్చే సన్నివేశంలో హీరో చిరంజీవి విలన్ తలను నరకడం హింసాత్మకంగా ఉందని, 6సెకెన్లు ఉన్న ఈ సీన్ కట్ చేశారు. ఈ సీన్ ప్లేస్ లో చిరంజీవి, తమన్నా క్లోజప్ షాట్‌ను జతపరిచారు. అలాగే ఇటీవల దసరాలో కూడా ఉన్న ఒక పదంతో వచ్చే డైలాగును సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేయించారని రిపోర్టులో చూపారు.
Also Read: మెగాస్టార్ “చిరంజీవి”, నటసింహం “బాలకృష్ణ” లాగానే… కూతురి వయసు ఉన్న హీరోయిన్లతో జతకట్టిన 10 హీరోస్..!

ప్రజా గాయకుడిగా గద్దర్ ఎన్నో స్టేజ్ ల మీద పాటలు పడుతూనే, మారో వైపు ఉద్యమ చిత్రాలకు పాటలు కూడా రాశారు. అలా సినిమాలలోని ఉద్యమ పాటల ద్వారా గద్దర్ త్వరగా ప్రజలకు చేరువయ్యారు. వాటిలో ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు, నటుడు మరియు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రాలకు ఆయన ఎక్కువగా సాంగ్స్ రాశారు.
అంతేకాకుండా 1979 లో ‘మా భూమి’ అనే మూవీలో బండి యాదగిరి రాసిన బండెనక బండి కట్టి అనే పాటను గద్దర్ పాడారు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట సమయంలో ఈ పాట ప్రధాన పాత్రను పోషించి, ప్రజలను ఉత్తేజితపరిచిన పాటగా నిలిచింది. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆయన పాడిన బండెనక బండి కట్టి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అంతలా గద్దర్ ప్రజాగాయకుడుగా తెలంగాణ ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. గద్దర్ పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. బండెనక బండి కట్టి – మా భూమి:
2007లో హీరో విజయ్ రాఘవేంద్ర, స్పందన వివాహం జరిగింది. స్పందన బెంగళూరు మాజీ పోలీస్ ఆఫీసర్ బీకే శివరామ్ కుమార్తె. ఈ జంటకి కుమారుడు శౌర్య ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు కన్నడ పరిశ్రమలో భారీగా అభిమానులు ఉన్నారు. స్పందన 2016లో రిలీజ్ అయిన ‘అపూర్వ’ అనే కన్నడ చిత్రంతో పాటు పలు చిత్రాలలో నటించారు. అంతేకాకుండా భర్త విజయ్ రాఘవేంద్ర సినిమాలకు నిర్మాతగా స్పందన పలు సినిమాలను సైతం నిర్మించింది.
రీసెంట్ గా ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్ టూర్‌కు వెళ్లిన స్పందన ఈరోజు (సోమవారం) ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆమెను హాస్పటల్ కి తరలించేలోపే స్పందన మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 19 రోజుల్లో విజయ్ రాఘవేంద్ర, స్పందనల 16వ వివాహ వార్షికోత్సవం రానుంది. ఈ లోపే స్పందన మరణించడం అందరినీ కలచివేస్తోంది. స్పందన భౌతికకాయం మంగళవారంలోగా బెంగళూరుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. స్పందన మరణం తీవ్రంగా కలచివేస్తోందని విజయ్ రాఘవేంద్ర సన్నిహితులు సామాజిక మధ్యమలలో పోస్టులు పెడుతున్నారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ హీరో అయిన విజయ్ రాఘవేంద్ర దాదాపు 50 చిత్రాలకు పైగా నటించారు. 20కు పైగా సాంగ్స్ ను పాడారు. ప్రస్తుతం ఆయన పలు టెలివిజన్ షోలలోని డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.













































