ఇండస్ట్రీలో హీరోలకి హీరోలకి మధ్య స్నేహం ఉండదు అని అంటారు. కానీ అది తప్పు అని చాలా మంది హీరోలు నిరూపించారు. అయితే హీరోలకి, డైరెక్టర్లకి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కొంత మంది అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు స్నేహితులుగా కొనసాగుతుంటారు.
అలా మన ఇండస్ట్రీలో ఒక హీరో, ఒక దర్శకుడు చాలా మంచి స్నేహితులు అవ్వడం చూస్తూనే ఉంటాం. కొంత మంది దర్శకులను ఇదే విషయానికి ట్రోల్ కూడా చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక దర్శకుడి గురించి కామెంట్స్ వస్తున్నాయి.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎక్కడో ఒక ఊరి నుండి ఇండస్ట్రీకి వచ్చి, ముందు మాటల రచయితగా, ఆ తర్వాత దర్శకుడుగా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా చదివితే ఆయన పేరు చెప్పకపోయినా ఆయన ఎవరో తెలిసిపోయి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా ఉన్నప్పుడు ఆయన మాటల వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. చాలా సున్నితమైన అంశాల మీద సినిమాలు తీస్తారు అని, ఎమోషన్స్ తో పాటు కాస్త లైట్ హార్టెడ్ కామెడీ కూడా ఆయన సినిమాల్లో ఉంటుంది అని అంటూ ఉంటారు.

అప్పటి వరకు మనం ఒకరకంగా చూసిన ఆ హీరోని ప్రేక్షకులకు ఇంకొకరకంగా చూపించే దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమాలు కొన్నే అయినా కూడా, ప్రతి సినిమాకి తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న కారణంగా కొంత మంది స్నేహితులు అయినా ఉంటారు. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంతో మంది స్నేహితులు ఉన్నా కూడా, మొదటిగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. వీరిద్దరూ ఒకరికి ఒకరు చాలా సంవత్సరాల నుండి తెలుసు.

ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. కాబట్టి ఆ మాత్రం స్నేహం ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో త్రివిక్రమ్ ప్రమేయం కూడా ఉంటుంది అనే వార్తలు చాలా సంవత్సరాల నుండి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో చాలా సినిమాలు రీమేక్ సినిమాలు. అసలు వాటిలో ఇటీవల వచ్చిన కొన్ని రీమేక్ సినిమాలు పవన్ కళ్యాణ్ చేయడానికి కారణం త్రివిక్రమ్ అని, త్రివిక్రమ్ ఆ సినిమాలని రీమేక్ చేయమని పవన్ కళ్యాణ్ కి సూచించారు అని, అవి తెలుగుకి తగ్గట్టు మార్పులు కూడా చేశారు అని అంటున్నారు.

ఇదే విషయాన్ని ఇటీవల బ్రో డైరెక్టర్ సముద్రఖని మాటల మధ్యలో చెప్తూ, ఒక సందర్భంలో సముద్రఖని ఈ సినిమా స్టోరీని త్రివిక్రమ్ శ్రీనివాస్ కి వినిపిస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ తెలుగులో చేస్తే మీకు ఓకేనా అని అడిగి, దానికి తగ్గట్టు పది నిమిషాల్లో సినిమా స్టోరీ మార్చేశారు అని అన్నారు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏమైనా కానీ, అది సినిమా రిజల్ట్ తర్వాత నెగిటివ్ అయ్యింది. త్రివిక్రమ్ పది నిమిషాల్లో సినిమా స్టోరీ మార్చేశారు, అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది అని అనడం మొదలు అయ్యింది.

అయితే అలా త్రివిక్రమ్ ప్రమేయంతో వచ్చిన సినిమా కేవలం ఇది మాత్రమే కాదు. అంతకు ముందు వచ్చిన భీమ్లా నాయక్ సినిమా రూపకల్పనలో కూడా త్రివిక్రమ్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. అంతే కాకుండా వకీల్ సాబ్ సినిమాలో కూడా త్రివిక్రమ్ ప్రమేయం ఉంది అని అంటారు. ఆ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో అప్పుడు త్రివిక్రమ్ ని ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ మారడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై కొంత మంది మరొక కోణంలో కూడా కామెంట్స్ చేస్తున్నారు.

అదేంటంటే, “ఎంత త్రివిక్రమ్ చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా ఉంటేనే సినిమా రూపొందుతుంది. ఏ సినిమా చేయాలి అనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ కి కూడా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన దానికి సరే అని అయితే పవన్ కళ్యాణ్ అనలేరు. అంతా ఆలోచించి మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారు. ఒకవేళ సినిమా హిట్ అయితే పవన్ కళ్యాణ్ పవర్ అంటారు, ఇప్పుడు ఒక్కసారి సినిమా రెస్పాన్స్ ఇలా ఉంటే త్రివిక్రమ్ ని మాత్రం ఎందుకు అంటున్నారు?” అని కామెంట్స్ చేస్తున్నారు.

“సినిమా హిట్ అయినప్పుడు కూడా త్రివిక్రమ్ కి క్రెడిట్ ఇవ్వాలి కదా? కేవలం ఫ్లాప్ అయినప్పుడు మాత్రమే త్రివిక్రమ్ ని ఎందుకు అనడం?” అని అంటున్నారు. దీనికి చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలకి ఎన్నో కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అని, ఒక ఫ్రెండ్ సినిమాకి చేస్తూ అన్ని కోట్ల డబ్బులు తీసుకోవడం ఎందుకు అని అంటున్నారు.

ఈ విషయంపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. “ఎంత స్నేహితుడు అయినా కూడా త్రివిక్రమ్ ఒక స్టార్ డైరెక్టర్. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఆయనకు ఎంతో ప్రతిభ ఉంది కాబట్టి ఆయనని హీరోలు అంతగా నమ్ముతున్నారు. మరి అలాంటి ప్రతిభ ఉన్న దర్శకుడు ఉచితంగా ఎందుకు పని చేస్తారు?” అని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ విషయంపై రెండు రకమైన వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి.

ఇది ఇప్పటి నుంచి కాదు. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న విషయం. ఈ కామెంట్స్ ఎంతో మంది డైరెక్టర్ల మీద వచ్చాయి. వాళ్లు హిట్ సినిమాలు తీసినప్పుడు వాళ్ళని ఎంత పొగుడుతారో, అదే వాళ్లు పొరపాటున ఒక్క ఫ్లాప్ సినిమా చేస్తే దానికి రెండు రెట్లు ఎక్కువగా వారిపై కామెంట్స్ వస్తాయి. కానీ మన ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం హీరోకి ఇచ్చేయడం, అదే సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ ని, లేకపోతే ఆ సినిమా హీరోయిన్ ని ఐరన్ లెగ్ అనడం, వాళ్ల వల్ల సినిమా పోయింది అనడం కామన్ అయిపోయింది ఏమో.
ALSO READ : మొదటి ఎపిసోడ్ నుండి క్లైమాక్స్ వరకు… ఏం అవుతుంది అనే సస్పెన్స్..! ఈ సిరీస్ చూశారా..?

శివజ్యోతి ఏ విషయం అయినా సరే సూటిగా మాట్లాడుతుంటారు. జ్యోతక్క అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన శివజ్యోతి తాజాగా తన ఛానెల్ లో హోం టూర్ వీడియోను చేసింది. మణికొండలో ఆమె తీసుకున్న ఫస్ట్ హౌజ్ గురించి వివరించింది. ఆ ఇంటిని 2019లో కొనుగోలు చేసినట్లుగా, ఫిబ్రవరి 2020లో గృహప్రవేశం చేశామని తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే ఆ ఇంటికి మారినట్లుగా చెప్తూ తన ఇంటిని, ఇంటి లోపల అంతా చూపించింది. ఇంటి లోపలి ఇంటీరియర్ ను దగ్గరుండి మరి డిజైన్ చేయించుకున్నానని వెల్లడించింది. ఇక వీడియో చివర్లో ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా, తాము ఆ ఇంట్లో ఉండట్లేదని, ఆ ఇంటిని చాలా ఇష్టంగా కొన్నట్లు తెలిపింది.
తాను న్యూస్ ఛానల్ మొదలు పెట్టానని, అయితే ఆ ఛానెల్ కి వ్యూస్ రాలేదని, డిప్రెషన్‌కు గురి అయ్యానని తెలిపింది. ఈ ఇల్లు లక్ అనుకున్నానని, అందుకే ఛానల్ సక్సెస్ అవుతుందని భావించాను. కానీ అలా జరగలేదని, రెండు ఇళ్ళ ఈఎంఐలు కట్టాలని. అందుకే ఈ ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా వెల్లడించింది. ఊరికనే నన్ను తిట్టకండి. అలా చేయడం వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది’ అని శివజ్యోతి కన్నీరు పెట్టుకుంది.



ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఎన్టీఆర్, ఆకకఎనేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అగ్ర హీరోలతో నటించింది. ఆమె తమిళ ఇండస్ట్రీలో అనేక చిత్రాలలో నటించారు. 1985లో రిలీజ్ అయిన తమిళ చిత్రం ‘మీందుం ఓర్ కాదల్ కతి’. ఈ చిత్రానికి మొదటిసారిగా ప్రతాప్ బోతన్ డైరెక్షన్ చేయగా, ఈ మూవీని రాధిక నిర్మించారు. ఈ మూవీ సమయంలోనే రాధికకు ప్రతాప్ పోతన్ తో పరిచయం ఏర్పడింది.
అంతేకాకుండా ఈ చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా అని అప్పట్లో వీరిద్దరి పై రూమర్స్ కూడా వచ్చాయి. వీరి ప్రవర్తన కూడా అలాగే ఉండేదని టాక్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించుకున్న ఈ జంట మధ్య సఖ్యత లేకపోవడంతో పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే విడాకులు తీసుకుని విడిపోయారు.
ఆ తరువాత రాధిక ఒక బ్రిటీన్ ఇండియన్‌ను వివాహం చేసుకున్నప్పటికి, అతనికి విడాకులు ఇచ్చి, ఆ తర్వాత సీనియర్ హీరో శరత్ కుమార్‌ను మూడవ వివాహం చేసుకుంది. ఇక ప్రతాప్ పోతన్ కూడా వీరు విడిపోయిన 5 ఏళ్ళకు రెండవ పెళ్లి చేసుకున్నాడు. పన్నెండు ఏళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ప్రతాప్ పోతన్ 2022లో కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.
దర్శకుడు మెహర్ రమేష్ తన సినిమాలలోని హీరోలను చాలా స్టైలిష్ గా చూపిస్తాడని తెలిసిందే. ఈ చిత్రంలో చిరు ను ఎలా చూపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన భోళా మానియా పాటలో మెగాస్టార్ చిరంజీవి లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా నటిస్తుండగా, యంగ్ హీరో సుశాంత్ ఆమెకి బాయ్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం గురించి వస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారంగా, మూవీ అవుట్‌పుట్ ఎబౌవ్ యావరేజ్ అని, ఒక్కసారి చూడవచ్చు అని వినిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా భారీ నష్టం రావడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ కావచ్చు అని ఇన్సైడ్ టాక్.
ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేష్ గత చిత్రాలు ప్లాప్ అవగా, వాటివల్ల భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో మంచి టాక్ వస్తే, మూవీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.








