సూపర్ స్టార్ రజినీకాంత్, తలైవా కి అభిమానులు తమిళంలోనే కాదు తెలుగులోనూ చాలా మంది ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్లు దద్దరిల్లి పోతాయి. ఇక ఇప్పుడు నెల్సన్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ మూవీ ఆగస్ట్ 10వ తేదీన ఘనంగా విడుదల కానుంది.
ఈ సినిమా కచ్చితంగా భారీ హిట్ కొడుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. కానీ అక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. అయితే రజినీకాంత్ పక్కన తమన్నా హీరోయిన్ నటిస్తున్న జైలర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కమర్షియల్ గా కానీ అన్ని రకాలుగా ఈ 2 గంటల 49 నిమిషాల నిడివిలో ఉన్న సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమా ఒక్క రోజులో జరిగే కథతో అల్లుకుని ఉంటుందని… బొమ్మ అదుర్స్ అని, రజినీకాంత్ లుక్, ఎలివేషన్ అదుర్స్ అని, అచ్చం వింటేజ్ రజినీకాంత్ ను చూసిన అనుభూతి కలగడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

అంత బాగానే ఉంటే రజినీకాంత్ జైలర్ సినిమాకు ఆటంకంగా భోళా శంకర్ మూవీ వచ్చిందనే చెప్పని. చిరంజీవి నటించిన భోళా శంకర్ ను ఆగస్ట్ 11 న విడుదల చేస్తున్నారు. దీంతో జైలర్ మూవీకి కలెక్షన్స్ కి కాస్త కష్టమనే చెప్పాలి. కానీ ఏది ఏమైనా సినిమా హిట్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు పెద్ద హీరోలతో విడుదల అవుతున్న సినిమాల్లో… ఇద్దరు మెగా హీరోల సరసన తమన్నా హీరోయిన్ గా నటించడం విశేషం.
ALSO READ : పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి నాజర్ రిప్లై..! ఏం అన్నారంటే..?


















ఇటీవల వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాలో హీరోకు ‘గురక’ సమస్య ఉన్నట్టే, ‘జానకి జానే’ మూవీలో హీరోయిన్ కు ‘భయం’ అనే మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో ఈ మూవీలో చూపించారు. సైజు కురుప్, నవ్య నాయర్ ప్రధాన పాత్రలలో నటించగా, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, అనార్కలి మరికర్, షరఫ్ వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి జానకి (నవ్య నాయర్), చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఫ్యామిలీ భారం ఆమె పైనే పడుతుంది. అమ్మతో ఉంటూ ఒక ప్రెస్ లో వర్క్ చేస్తుంటుంది. అయితే జానకికి భయం ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఎవరైనా మాట్లాడినా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా, చీకటిగా ఉన్న చాలా భయపడుతుంది. ఒకసారి భయంతో జానకి స్పృహ తప్పి పడిపోగా, రోడ్ కాంట్రాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ (సైజు కురుప్) రక్షించి, ఇంటికి తీసుకెళ్తాడు.
జానకిని ప్రేమించిన ఉన్ని ముకుందన్ వారి పెద్దలను ఒప్పించి మరి జానకిని పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగుతున్న వీరి లైఫ్ లో ఎదురైన అనుకోని సంఘటన ఏమిటి ? దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అయిన షాజీ (కొట్టాయం నజీర్), మార్టిన్ (జార్జ్ కోరా) ఎలా ఉపయోగించుకున్నారు? దానివల్ల ఉన్ని, జానకి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఆఖరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
ఇన్నాళ్లూ ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు ఒక ట్వీట్‌తో అనే కంటే ట్వీట్లోని రాసిన పదంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు ఆ ట్వీట్ కి సంతోషంతో కూడా కామెంట్లు పెడుతున్నారు. బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ కు విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది.
ట్రోల్ చేసేంతగా ఆ ట్వీట్ లో ఏముంది అంటే “మా చిత్రం #BroTheAvatar రేపు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం @పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ స్పేస్‌ను చేసుకోవడం సంతోషంగా ఉంది. మరణించిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక వ్యక్తి సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేదే ఈ కథ.’’ అని ఊర్వశి రౌతేలా రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అని అనడంతో నెటిజన్లు, ప్రత్యర్ధి పార్టీల ఫ్యాన్స్ మాత్రం ఊర్వశిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కల్కి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా కల్కి 2898 ఏడీ సినిమాకి సీక్వెల్ ఉంటుందని వినిపిస్తోంది. ఈ విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలాగే మూవీలో ప్రభాస్‌ను ఎందుకు తీసుకున్నారనే విషయం గురించి కూడా మాట్లాడారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడు తాను ఆలోచించడం లేదని నాగ్ అశ్విన్ అన్నారు. అలాగే ఈ మూవీ ఫ్రాంచైజీ గురించి కూడా ఇంత వరకు ఏం ప్లాన్ చేయలేదని చెప్పారు.
వల్లిపురం వసంతన్ ను నామ్ డి గెర్రే కెప్టెన్ మిల్లర్ అని పిలుస్తారు. శ్రీలంకలోని వేర్పాటువాద తమిళ మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) లో వసంతన్ సభ్యుడు. అతనే LTTE మొట్ట మొదటి బ్లాక్ టైగర్ గా పిలవబడ్డాడు. మిల్లర్ 1966లో జనవరి1న శ్రీలంకలో జన్మించాడు. అతను తున్నలైకి చెందిన వ్యక్తి. అతని తండ్రి బ్యాంక్ మేనేజర్, అతనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వసంతన్ పాయింట్ పెడ్రోలోని హార్ట్లీ కాలేజీలో చదువుకున్నాడు.
బ్లాక్ జులై తమిళ వ్యతిరేక అల్లర్ల వల్ల బాధితులయినవారి బాధలను చూసి తీవ్రంగా ప్రభావితమైన వసంతన్ 1983లో LTTEలో డ్రైవర్‌గా చేరాడు. ఒక సంవత్సరం తర్వాత అతను LTTE సభ్యుడుగా మారాడు. అప్పుడే అతనికి నామ్ డి గెర్రే మిల్లర్ (మిల్లర్) అనే పేరు వచ్చింది. వడమరచ్చి ఆపరేషన్ (ఆపరేషన్ లిబరేషన్) టైమ్ లో శ్రీలంక ఆర్మీ నెల్లియాడి మధ్య మహా విద్యాలయాన్ని స్వాధీనం చేసుకుని సైనిక స్థావరంగా మార్చింది. భారీగా పటిష్టపరచబడిన ఆ స్థావరాన్ని స్వాధీనం చేసుకోవాలని LTTE నిర్ణయించింది.
దాని కోసం బాంబులతో నింపిన వాహనాన్ని ఆ స్థావరం మధ్యలోకి తీసుకెళ్లాడానికి మిల్లర్ తనకు తానే ముందుకు వచ్చాడు. దానికి ముందుగా మిల్లెర్ 1987లో జూన్29 కుటుంబాన్ని, స్నేహితులను కలిశాడు. అదే ఏడాది జూలై 5న LTTE ఒక ట్రక్కులో బాంబులను నింపారు. ఆ తరువాత మిల్లర్ ఆ ట్రక్కును నడుపుకుంటూ నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో ఉన్న ఆర్మీ క్యాంపులోకి తీసుకెళ్ళాడు. సైనికులు కాల్పులు జరపడంతో మిల్లర్ చనిపోయాడు. కాని ట్రక్ వెళ్తూ ప్రధాన భవనంలోకి దూసుకెళ్లి అక్కడ పేలిపోయింది.
పేలుడుతో బస్సు అంత పరిమాణంలో పెద్ద బిలం ఏర్పడింది. మిల్లర్ ట్రక్కును అనుసరిస్తూ వెళ్ళిన ఇతర LTTE కార్యకర్తలు ఆర్మీ శిబిరం మీద దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎంతో మంది సైనికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ సంఘటన అంతా వీడియో తీయబడింది. మిల్లర్ చనిపోయిన తరువాత కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. మిల్లర్ LTTEలో గౌరవనీయమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అంతేకాకుండా LTTE ఆత్మాహుతి విభాగం బ్లాక్ టైగర్స్ చిహ్నం పై మిల్లర్ ముఖ చిత్రాన్ని పెట్టారు.
జూలై 5ను బ్లాక్ టైగర్స్ డే గా మార్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు బ్లాక్ టైగర్ అమరవీరులందరిని స్మరించుకునే రోజు. నెల్లియాడి మధ్య మహా విద్యాలయంలో మిల్లర్ బంగారు విగ్రహంతో పాటు ఒక మందిరాన్ని కూడా నిర్మించారు. అయితే 1996లో శ్రీలంక సైన్యం వడమరచ్చి ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మిల్లర్ మందిరాన్ని ధ్వంసం చేశారు. కానీ స్థానికులు మిల్లర్ విగ్రహాన్ని దాచిపెట్టారు.
2002లో నార్వేజియన్ మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సమయంలో కొత్త స్మారక ఫలకంను మరియు మిల్లర్ విగ్రహంను తిరిగి స్థాపించారు. యుద్ధం మళ్ళీ ప్రారంభమైన తర్వాత, 2006లో ఆగస్టు23న మిల్లర్ విగ్రహం పై దాడి చేసి ధ్వంసం చేశారు. అలాగే మందిరం యొక్క అవశేషాలను, మిల్లర్ విగ్రహం ఉన్న వేదిక, రాతి స్మారక ఫలకంను కూడా సైన్యం ధ్వంసం చేసింది.

