హీరోయిన్స్ రూపమే కాకుండా వారు చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా వారి అభిమానులను అలరిస్తూ ఉంటాయి. అయితే చాలామంది హీరోయిన్స్ ఇతర భాషల నుండి వచ్చినవారు కావడంతో వారికి డబ్బింగ్ చెప్పేది వేరేవారు అనేది తెలిసిందే.
తెర పైన కనిపించేది హీరోయిన్స్ అయినా గాత్రదానం చేసేది మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టులే. రాశికన్నా, కాజల్ అగర్వాల్, రష్మిక లాంటి హీరోయిన్లకు గొంతు అరువు ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్టు ప్రియాంక తుంపాల. ఆమె గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రియాంక తుంపల టాలీవుడ్ లో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ లలో ఒకరు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గురించి పలు విషయాలను తెలిపారు. ప్రియాంక స్వస్థలం విశాఖపట్నం. తాను ఒక కార్పొరేట్ ఉద్యోగినని, బీఏ చేసిన ఆమె ప్రొడక్ట్ బ్రాండింగ్, ఆర్జే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేశానని అన్నారు. ఒకసారి పని మీద అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లానని, ఆ సమయంలో ‘విలేజ్‌లో వినాయకుడు’ మూవీ కోసం డబ్బింగ్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.
అక్కడే మొదటిసారి డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల గురించి తెలిసిందని, ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో సరదాగా అందులో పాల్గొన్నాను. డైరెక్టర్‌కి నా గొంతు నచ్చడంతో ఆ మూవీలో అవకాశమిచ్చారు. ఆ మూవీనే నా ఫస్ట్ మూవీ అని తెలిపారు. వర్క్ నచ్చడంతో డబ్బింగ్ ను కొనసాగించానని అన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గత 15 ఏళ్లుగా చాలా మంది ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పానని, అలా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు.
అలా ప్రియాంక తుంపాల కాజల్ అగర్వాల్, రాశికన్నా, తమన్నా, సాయిపల్లవి, పూజా హెగ్దే, రష్మిక, రెజీనా, నభా నటేష్, ఐశ్వర్య లక్ష్మి, అనన్యపాండే, కేతిక శర్మ వంటి ఎంతోమంది కథానాయకలకు గాత్రదానం చేసింది. ఆమె తెలుగు, హిందీ మాత్రమే కాకుండా డిస్నీ, మార్వెల్ వంటి హాలీవుడ్ సంస్థలకూ ప్రియాంక జర్నీ సాగింది. అలా కెప్టెన్ మార్వెల్, జంగిల్ క్రూజ్, ఎటర్నల్స్, ఎవెంజర్స్ ఎండ్ గేమ్, ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ చిత్రాలకు కూడా పని చేసారు. ఆమె కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు 150కి పైగా చిత్రాలకు వర్క్ చేసారు.
Also Read: “భరత్ అనే నేను” సినిమాలో “శుభోదయం సుబ్బారావు” గా నటించిన నటుడు ఎవరో తెలుసా..?








పై ఫోటోలో గ్రీన్ షర్ట్ వేసుకుని ఫోటోకి ఫోజు ఇస్తున్న ఈ అబ్బాయి, గొప్ప నటుడుగా పేరున్న తండ్రికి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీలో లో స్టార్ హీరోగా మారారు. తాను నటించే పాత్ర కోసం ఎంతైనా కష్టపడడం, ఆ పాత్రలో ఒదిగిపోవడం, లవ్, యాక్షన్ ఎమోషన్ ఏదైనా అద్భుతంగా చేయడం అతని ప్రత్యేకత. కథ, తాను చేసే పాత్ర నచ్చితే ఇతర భాషలలో నటించి, మెప్పిస్తున్న ఈ హీరోకి ఇతర ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.
అంత టాలెంట్ ఉన్న హీరో ఎవరంటే దుల్కర్ సల్మాన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. నిన్న (జూలై 28) దుల్కర్ బర్త్ డే సందర్భంగా అభిమానులు విషెస్ చెప్తూ, దుల్కర్ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా ద్వారా హీరోగా మారి, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అద్బుతమైన క్యారెక్టర్లు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
‘సీతా రామం’ తో టాలీవుడ్ లో చెరుగని ముద్ర వేసిన దుల్కర్, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్, మరియు పోస్టర్ దుల్కర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. నటుడిగా మాత్రమే కాకుండా సింగర్, నిర్మాత కూడా. దుల్కర్ సల్మాన్ భార్య పేరు అమల్ సూఫియా. వీరికి ఒక పాప ఉన్నారు.
ఆ క్రమంలోనే జమిని ఛటర్జీ మనవరాలు జర్నలిస్టు అయిన రాణి ఛటర్జీ (ఆలియాభట్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ రాణి, రాకీ ప్రేమకు ఇద్దరి ఫ్యామిలీలు అభ్యంతరం చెబుతాయి. అయితే రాణి, రాకీ ప్రేమకు వారి కుటుంబాల నుండి ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి? తమ ప్రేమ గెలిపించుకోవడానికి రాకీ, రాణి ఏం చేశారు? అనేది మిగిలిన కథ.
రివ్యూ:
మిఠాయి బిజినెస్ నిర్వహించే ఫ్యామిలీకి చెందిన యువకుడిగా రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. స్టైల్,బాడీ లాంగ్వేజ్, లుక్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటాడు. జర్నలిస్టు పాత్రలో రాణి గా,ఎమోషనల్ సన్నివేశాలలో ఆలియా భట్ నటన బాగుంది.ధర్మేంద్ర, షాబానా ఆజ్మీ, జయబచ్చన్ వారి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. వరుణ్ ధావన్, సారా ఆలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. మిగతా వారు తమ పాత్రల మేరకు నటించారు.
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకి ప్రీతమ్ అందించిన సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ష్, సినిమాటోగ్రఫి బాగుంది. ధనవంతుల కుటుంబాల ఇంటి సెటప్‌తో సహా ప్రతీ సీన్ రిచ్‌గా తీశారు. డైలాగ్స్ ఫన్, కామెడీ, ఎమోషనల్ ఆకట్టుకున్నాయి. మూవీలో ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :









