తమిళ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడు గా వెలిగిన స్టార్ కుటుంబ పోషణ కోసం ఆఖరికి కార్ డ్రైవర్ గా మారాడు.
ఇండస్ట్రీ అందరికీ అచ్చి వస్తుంది అనే గ్యారెంటీ లేదు అనడానికి ఇతని జీవితం ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభంలో ఎంత త్వరగా స్టార్ డమ్ సంపాదించాడు అంతే త్వరగా అవకాశాలు లేకుండా పోయాయి.
19 సంవత్సరాలకే సినీ కెరియర్లో అడుగుపెట్టిన అబ్బాస్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ప్రేమదేశం చిత్రంతో తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత తమిళ్ మరియు తెలుగు చిత్రాలలో బాగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్.. సక్సెస్ లేక అవకాశాలు తగ్గి మెయిన్ హీరో రేంజ్ నుంచి సైడ్ క్యారెక్టర్ చేసే స్థితికి పడిపోయాడు.
ఒకపక్క కెరియర్ సరిగా లేకపోవడం మరొక పక్క ఆర్థిక ఇబ్బందులు బాగా కుంగతీయడంతో ఒకానొక సమయంలో అతను ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించారట. ఇక ఇండస్ట్రీలో ఉండడం కష్టమని భావించి కుటుంబంతో కలిసి ఇండియా వదిలి న్యూజిలాండ్ కు వెళ్ళిపోయారు. ఇక అక్కడ కుటుంబాన్ని పోషించడం కోసం కార్ డ్రైవర్ గా , చివరికి మెకానిక్ గా కూడా పనిచేశారు. అబ్బాస్ ఎప్పుడు తన లైఫ్ ప్రైవేట్ గా ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు. అతని కెరీర్ లో కూడా పాల్గొన్న ఇంటర్వ్యూల సంఖ్య చాలా తక్కువ అని చెప్పవచ్చు.
అలాంటి అబ్బాస్ రీసెంట్ గా తాను ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచనలతో ఎలా పోరాటం చేశాడు అలాగే సినీ పరిశ్రమకు ఎందుకు దూరమయ్యాడు అనే విషయాలపై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. కరోనా సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అని భావిస్తున్న చాలామందిలో జూమ్ కాల్ ద్వారా అతను చైతన్యం తీసుకువచ్చారు. ఇన్నాళ్ల తర్వాత అబ్బాస్ ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నాడో తెలుసుకొని అతని అభిమానులు బాధపడ్డారు.
watch video :