సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జైలర్. ఇందులో రజనీకాంత్ కు జంటగా తమన్నా నటిస్తోంది. నెల్సన్ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను సన్ పిక్చర్స్ నిర్వహిస్తుంది.
ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట ‘హుకుం…’సోమవారం నాడు విడుదలై మంచి పాజిటివ్ బజ్ సంపాదించింది. ఈ పాట ఎంత పవర్ ఫుల్ గా ఉంటుంది అనేది చెబుతూ రజినీకాంత్ చెప్పిన సంభాషణతో ఓ వీడియోని కూడా మూవీ టీం విడుదల చేయడం జరిగింది.

ఇది పులి హుకుం అంటూ సందడి చేసిన రజినీకాంత్ వీడియో బాగా వైరల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ మంచి పవర్ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది . ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఇదే గనుక స్టోరీ లైన్ అయితే…పిక్చర్ వేరే రేంజ్ లో ఉండడం కన్ఫామ్ అని నటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

వస్తున్న వార్తల సారాంశం ప్రకారం ఈ మూవీలో రజనీకాంత్ ఒక జైలు వార్డెన్ గా కనిపించబోతున్నారు. రజినీకాంత్ జైలర్ గా వ్యవహరిస్తున్న జైల్లో ఖైదు చేయబడిన తమ లీడర్ ని కాపాడడం కోసం జైల్ ను బ్రేక్ చేయడానికి ఒక గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. మిగిలిన స్టాఫ్ ఆ గ్యాంగ్ ను ఎదుర్కోలేక చేతులెత్తేసే సమయంలో రజినీకాంత్ వంటి చేత్తో ఆ గ్యాంగ్ నుంచి కాపాడడం మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైనట.

సింగిల్ ఎజెండాగా సాగే ఈ చిత్రం డైరెక్షన్ వహిస్తున్న నెల్సన్ ఇంతకుముందు ఇదే తరహాలో విజయ్ తో బీస్ట్ చిత్రాన్ని నిర్మించారు. అందులో కూడా ప్రధాన కథాంశం షాపింగ్ మాల్ అటాక్ చేసిన టెర్రరిస్ట్‌ల నుంచి విజయ్ మాల్ లో ఉన్న అందరిని ఎలా రక్షిస్తాడు అనే పాయింట్ చుట్టూ సాగుతుంది.

ఎంతో ఆసక్తిగా ఆ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ జైలర్ మూవీ ని కూడా మరింత ఆసక్తికరంగా రూపొందించి ఉంటారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. వచ్చే నెల పదవ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇందులో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ప్రత్యేక క్యామియో రోల్ లో కనిపించనున్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో ఒక నిరుపేద ఫ్యామిలిలో కానన్ దేవి 1916 ఏప్రిల్ 22న జన్మించింది. రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ కానన్ తల్లిదండ్రులు. కానన్‌కు సంగీతంలో శిక్షణ ఇచ్చే తండ్రి, కొద్దికాలనికే మరణించడంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి ఓనర్ ఇంట్లో నుంచి వారి కుటుంబాన్ని వెళ్లగొట్టాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లీకూతుళ్లు డబ్బున్న వారింటిలో పని మనుషులుగా చేరారు. ఉండడానికి ఇల్లు లేని వారికి ఒక బంధువు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు.
కానీ అంతలోనే అతడు తన నిజస్వరూపం చూపించాడు. ఏడేళ్లు కూడా నిండని కానన్ మరియు ఆమె తల్లితో చాకిరీ చేయించుకోవడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది భరించలేకపోయిన కానన్ తల్లితో పాటుగా ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ స్థితిలో కోల్‌కతాను విడిచి తిరిగి హౌరాకు వెళ్ళి, వేశ్యాగృహాలకు దగ్గరలో ఒక గది తీసుకుని ఉన్నారు. ఆ సమయంలో కానన్ ను చూసిన వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె సినీ రంగంలో రాణించగలదని గ్రహించాడు. అలా కానన్ 10 సంవత్సరాల వయసులో ‘జైదేవ్’ అనే మూవీలో ఛాన్స్ వచ్చింది.
ఆ మూవీ కోసం కానన్ తీసుకున్న నెల జీతం ఐదు రూపాయలు. ఆ తరువాత అవకాశాలు రావడంతో 1928-31 మధ్య బాలనటిగా అనేక సినిమాలు చేసింది. అదే టైమ్ లో సింగర్ గానూ సత్తా చాటింది. శంకరాచార్య, జోరేబరత్, విష్ణుమాయ, రిషిర ప్రేమ్, ప్రహ్లాద్ సినిమాలలో తన నటనతో ఆడియెన్స్ అలరించింది. విష్ణుమాయ, ప్రహ్లాద్ చిత్రాలలో బాలనటుడిగా చేసింది. ఇక 21 సంవత్సరాలకే హీరోయిన్గా నటించిన కానన్ దేవి నటనకు, అందానికి, ఫిదా అవనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
తక్కువకాలంలోనే ఆమె సూపర్‌స్టార్‌గా మారింది. పాట పాడినందుకు లక్ష, హీరోయిన్గా ఐదు లక్షలు రెమ్యూనరేషన్ అందుకునేది. ఆమె 40 పాటలు పాడగా, సుమారు 57 చిత్రాలలో నటించింది. హీరోలకు మాత్రమే సలాం కొట్టే రోజుల్లో కానన్ ను అందరు మేడమ్ అని పిలిచేవారు. మేడమ్ అనిపించుకున్న తొలి హీరోయిన్ కానన్ దేవి. ఆమె కేఎల్ సెఘల్, ప్రథమేశ్ బరువా, పంకజ్ మాలిక్, పహరి సాన్యల్, అశోక్ కుమార్, చబీ బిస్వాస్ వంటి అగ్ర హీరోలతో నటించి, వారికి తీసిపోని విధంగా కోటీశ్వరురాలిగా ఎదిగింది.
1940 డిసెంబర్లో కానన్ బ్రహ్మ సమాజ మెంబర్ అయిన హిరంబ చంద్ర మిత్ర తనయుడు అశోక్ మిత్రాను వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన 5 ఏళ్లకే భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత బెంగాల్ గవర్నర్ వద్ద ఏడీసీగా వర్క్ చేసిన హరిదాస్ భట్టాచార్జిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత హరిదాస్ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో అందరూ హరిదాస్ ని కానన్ భర్తగా మాత్రమే చూశారు. ఇది భరించలేకపోయిన హరిదాస్ 1987లో ఏప్రిల్ 4న కానన్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. విడాకులు తీసుకోకుండానే ఇద్దరు విడివిడిగా జీవించారు.
76 ఏళ్ల వయసులో కానన్ దేవి అనారోగ్యంతో 1992లో జూలై 17న మరణించింది. హరిదాస్ కానన్ దేవిని ఆఖరిసారి చూడడానికి కూడా రాలేదు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కానన్ చివరికి ఒక అనాధగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. సినీ ఇండస్ట్రీకి కానన్ దేవి చేసిన సేవలకు గానూ 2011లో తపాలా శాఖ ఆమె పేరిట ఒక స్టాంపును రిలీజ్ చేసింది.

గంగోత్రి మూవీ రిలీజ్ అయ్యి, 20 ఏళ్లు అవుతోంది. ఈ చిత్రం ద్వారా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఆదితి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తొలి మూవీ హిట్ అవడంతో ఇద్దరు ఈ మూవీ తరువాత ఆఫర్స్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తూ, అవి హిట్ అవడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. గంగోత్రి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 101 వ మూవీ కావడం విశేషం.




మాలయళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ చేసే పాత్ర ఏదైనా అద్భుతంగా నటిస్తాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్ ‘ధూమం’ అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీని యూటర్న్ మూవీ దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించాడు. కేజీఎఫ్ మూవీ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించింది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ధూమం సినిమాను సందేశాత్మక కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో రిలీజైంది.
ధూమం కథ విషయనికి వస్తే, ఒక సిగరెట్ కంపెనీలో అవినాష్ (ఫహాద్ ఫాజిల్) సేల్స్ హెడ్‌గా వర్క్ చేస్తూ, తన టాలెంట్ తో, మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో ఆ కంపెనీ సేల్స్ ను అధికంగా పెంచుతాడు. దాంతో అవినాష్‌ను ఆ కంపెనీ ఎమ్డీ సిద్ధార్థ్ (రోషన్ మాథ్యూ) ఉద్యోగిల కాకుండా ఫ్రెండ్ ల చూస్తుంటాడు. అయితే అవినాష్ సిద్దార్థ్ తో అభిప్రాయ భేదాలు రావడంతో సడెన్ గా జాబ్ కి రిజైన్ చేస్తాడు. నెక్స్ట్ డే అవినాష్ తన భార్య దియా (అపర్ణ బాలమురళి)తో కలిసి కారులో వెళ్తుండగా అతడి పై ఒక ముసుగు వ్యక్తి దాడి చేసి డ్రగ్ ఇంజెక్షన్స్ అవినాష్ కి ఇస్తాడు.
డ్రగ్ ఎఫెక్ట్ నుండి అవినాష్ బయటకు వచ్చేసరికి ఒక కొండ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తిస్తాడు. అప్పుడు ఒక అపరిచితుడు అవినాష్ కు ఫోన్ చేసి. దియా బాడీలో ఓ మైక్రో బాంబ్ పెట్టామని, ఆ బాంబ్ పేలితే దియా ప్రాణాలు పోతాయని, అలా జరగకూడదు అంటే తెము చెప్పినట్టు వినాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. కోటి రూపాయల్ని అతను చెప్పిన దగ్గర ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. తనను ఫోన్లో బెదిరిస్తోన్న వ్యక్తి ఎవరో అవినాష్ కనిపిపెట్టాడా? తన భార్యను కాపాడుకున్నాడా? ఆ ట్రాప్ నుంచి అవినాష్ ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.
ధూమం సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్ బాగున్నప్పటికీ, చెప్పిన విధానంలో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. సాధారణంగా సినిమా మొదలయ్యే ముందు వచ్చే ముఖేష్ యాడ్ ని వివరంగా చూపించినట్టు అనిపిస్తుంది. ఫహాద్ ఫాజిల్ ట్రాప్‌లో ఇరుక్కుకోవడం మరియు ట్రాప్ నుండి బయటపడే సీన్స్ లో థ్రిల్లింగ్ మిస్ అవడమే కాకుండా రిపీటెడ్ సన్నివేశాలతో చాలా స్లోగా సాగుతాయి. విలన్ ఎవరనేది ఊహించే విధంగా ఉంటుంది. ఈ మూవీ ఫహాద్ వన్ మెన్ షో అని చెప్పవచ్చు. అవినాష్ క్యారెక్టర్ లో ఫహాద్ ఫాజిల్ జీవించాడు. సింపుల్ కథని తన నటనతో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.
రాజమౌళి సీరియల్ దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినీ దర్శకుడిగా మారారు. రెండవ చిత్రం సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారతీయ సినీ ప్రేక్షకుల అందరిని తెలుగు ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టేలా చేశాడు. ఇక బాహుబలితో భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులన్నిటిని తిరగ రాయడమే కాక, అంతర్జాతీయ ప్రేక్షకులు సైతంఆకట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటారు. అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ ను తెలుగు ఇండస్ట్రీకి అందించారు.
ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఎదురుచూస్తుండడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్లాప్ ఎరుగని రాజమౌళి సినిమాలు నిర్మాతలకు పెట్టినదానికన్న రెండు మూడు రెట్లు ఎక్కువ లాభాలను కురిపిస్తాయి. కానీ ఆయన తీసిన సినిమాలలో ఒకటి మాత్రం కమర్షియల్ గా విజయం సాధించిన కూడా కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ హిట్ అందుకోలేదని అంటున్నారు. అదే నితిన్ నటించిన ‘సై’ మూవీ. ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ తో ‘సై’ మూవీని నిర్మించారట. అయితే ఈ మూవీ లాంగ్ రన్ లో పన్నెండు కోట్లను మాత్రమే కలెక్ట్ చేసిందట. కమర్షియల్ గా ఈ మూవీ విజయం సాధించినా, కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ లకు అనుకున్న రేంజ్ లో లాభాలు రాలేదని, కొద్దిపాటి నష్టాలు వచ్చాయని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
‘బేబీ’ మూవీని చూసినవాళ్లకు సెన్సార్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ ఒక మూవీ నుండి మరొక మూవీకి రూల్స్ లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే సందేహం వస్తోంది అని అంటున్నారు. దానికి కారణం ఏంటి అనేది బేబీ మూవీ చూసినవారికి తెలుస్తుంది. లేదంటే ఆ మూవీ చూసినవాళ్లను అడిగినా ఈ విషయంలో క్లారిటీ వస్తోంది. ఇక ఈ విషయం పై సోషల్ మీడియాలో కూడా కామెంట్లు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే బేబీ మూవీలో బూతులను ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించారని టాక్.
అమ్మాయిలని అసభ్యకరంగా తిట్టే ఒక పదం ఈ చిత్రంలో అనేక సార్లు వినిపించిందట. అయితే కొన్నిచోట్ల మాత్రమే తిట్టు వాడినపుడు బీప్ పడింది. కానీ కొన్ని చోట్ల మాత్రం బీప్ లేకుండా అలానే వదిలేశారని అంటున్నారు. అది మాత్రమే కాకుండా కొన్ని మాటలు సెన్సార్ కట్ ను దాటి వచ్చాయని కూడా వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో లాంగ్ లిప్ లాక్‌ను కూడా అలాగే ఉంచేశారట. మరొక చోట కళ్లు – కాళ్లు అనే ఒక డైలాగ్ కొంచెం అతి అయ్యిందని అంటున్నారు.
ఓవర్సీస్కి వెళ్లిన బేబీ చిత్రంలో ఇలాంటివి ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఈ మూవీలోని డైలాగ్స్ వెబ్ సిరీస్‌లలో ఉండే డైలాగ్స్ తో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నాయని టాక్. దీంతో నెటిజెన్లు ఈ మూవీ విషయంలో సెన్సార్ బోర్డ్ ఇలాంటి వాటిని ఎందుకు అలాగే వదిలేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ప్రణీత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ మూవీతో ప్రణీతకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ప్రణీతకు విజయం దక్కలేదు.
ఇక లాక్ డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన బిజినెస్ మెన్ నితిన్ రాజుని ప్రణీత పెళ్లి చేసుకుంది. ఆ తరువాత 2022 జూన్ లో ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి ప్రణీత అలాగే అందంగా ఉంది. ఇటీవల కాలంలో మునుపటిలా మారి, గ్లామర్ ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. ప్రణీత గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది.
ప్రణీత సుభాష్ తన భర్త నితిన్ రాజుతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. భీమన అమావాస్య సందర్భంగా ప్రణీత తన భర్త పాదాలకు నేలపై కూర్చుని పూజ చేస్తోంది. ఈ ఫోటోకు మీకు ఇది తప్పుగా అనిపించి ఉండొచ్చు. కానీ హిందూ ధర్మంలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది అని కాప్షన్ ఇచ్చింది. గత ఏడాది ఇదే భీమన అమావాస్య సందర్భంగా చేసిన ప్రణీత తన భర్త పాదాలకు పూజ చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె పై మీమ్స్, ట్రోలింగ్ జరిగింది.