ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న.
ఛలో సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ క్రష్ గా మారింది. మొదట కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరకు స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది.

మరి తన ఈ ప్రయాణంలో తన దగ్గర ఎంత ఆస్తి సంపాదించింది? తన దగ్గర ఉన్న లగ్జరీ ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. ఈ అందాల రాశి మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ కార్ ని 50 లక్షల రూపాయలతో కొనుగోలు చేసింది. అంతేకాదు ఆడి క్యూ 3 కారు కూడా తన గ్యారేజ్ లో ఉంది. ప్రస్తుతం టయోటా ఇన్నోవా హుండై క్రేటా కార్లు కూడా రష్మిక కలిగి ఉంది.

ఇవేకాక రష్మికకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అందుకే అన్ని రకాల బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఏకంగా మూడు లక్షల రూపాయలకు పైగా ఒక్కో హ్యాండ్ బ్యాగ్ పై ఆమె వెచ్చిస్తుంది. అంతేకాదు బెంగళూర్‌లో 8 కోట్ల రూపాయల విలువచేసే బంగ్లా కూడా రష్మిక పేరున ఉందట. ఇటీవల ముంబై లగ్జరీ ఏరియాలో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ ని కూడా కొనుగోలు చేసిందట రష్మిక.

హైదరాబాద్ కి ముంబైకి ప్రస్తుతం ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్న రష్మిక హైదరాబాదులో కూడా రెండు కోట్ల విలువ చేసే ఒక ఇల్లును కలిగి ఉందట. ఇక ప్రతి సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల పారితోషకం తీసుకునే ఈ పుష్ప హీరోయిన్ కి చెప్పులు అంటే చాలా ఇష్టమట అందుకే లక్షలు పెట్టి ఎక్కువగా హై హీల్స్, షూస్ ని కొనుగోలు చేస్తూ ఉంటుంది.

1. శక్తి:
2. స్పైడర్:
3.అజ్ఞాతవాసి:
4. దడ:
5. డియర్ కామ్రేడ్
6.సాహో:
7. ది ఘోస్ట్:
8. రావణాసుర:
9. శాకుంతలం:
10. ఏజెంట్:
టిజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మహి.వి.రాఘవ్ సినీ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలకు పని చేశారు. విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ సినిమాలకు సహ నిర్మాతగా చేశారు. పాఠశాల అనే మూవీ ద్వారా దర్శకత్వం ప్రారంభించాడు. ఆ తరువాత ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం యాత్ర-2 మూవీకి దర్శకత్వం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మహి వి. రాఘవ్ పెళ్ళిళ్ళు విఫలం అవడం వెనుక ఉన్న కారణం గురించి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను డార్క్ ఫేజ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో దాని పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో దర్శకుడు మహి వి. రాఘవ్ ఇలా చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలలో సగానికి పైగా విడిపోతున్నారు. దానికి కారణం వుమెన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇలా అన్నిట్లో వారికి ఛాయిస్ లు ఎక్కువగా ఉండడం, స్త్రీలు పురుషుల కన్నా వేగంగా ఎవాల్వ్ అవుతారు. విముక్తి పొందిన స్త్రీ ఎల్లప్పుడూ సమాజానికి ప్రమాదకరం. విముక్తి పొందిన స్త్రీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇది నా అభిప్రాయం మాత్రమే” అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో పై పలువురు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కి ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అని చెప్తూ మహి వి. రాఘవ్ కూడా కామెంట్ చేసారు.



ప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ మాట్లాడుతూ, హీరో అజిత్ తన వద్ద 25 సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నాడని, వాటిని ఇంత వరకు ఇవ్వలేదంటూ అజిత్ పై తీవ్రమైన విమర్శలు చేశాడు. తన పేరెంట్స్ ను మలేషియా పంపించడం కోసం అజిత్ తన దగ్గర డబ్బు తీసుకున్నాడు. అప్పుడు తన ప్రోడక్షన్ లో ఒక మూవీ చేసి రెమ్యూనరేషన్ లో ఈ డబ్బుని సర్దుబాటు చేస్తానని చెప్పాడు.
అయితే ఆ రోజు నుండి ఇంత వరకు తన బ్యానర్ లో అజిత్ ఒక్క సినిమా కూడా చేయలేదని మాణిక్యం తెలిపాడు. అజిత్ తనను పెద్ద మనిషి అని అనుకుంటాడు. కానీ అతను ఒక మోసగాడని అన్నారు. ఇన్నేళ్ల నుండి అజిత్ తో ఈ డబ్బు గురించి మాట్లాడుతూన్నా కూడా ఆయన సైడ్ నుండి ఎలాంటి స్పందన రావట్లేదని నిర్మాత మాణిక్యం వెల్లడించాడు.
ప్రస్తుతం అజిత్ ఒక్కో సినిమాకు 50 కోట్ల పైనే పారితోషికం తీసుకుంటున్నాడని, తనకు రావలసిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు అంటూ మాణిక్యం అజిత్ పై మండిపడుతున్నారు. ఈ విషయం గురించి మాణిక్యం గతంలో కూడా మీడియా ముందు మాట్లాడాడు. అయితే అప్పుడు, ఇప్పుడు అజిత్ వైపు నుండి కానీ, ఆయన సన్నిహితుల నుండి కానీ ఎటువంటి క్లారిటీ అయితే రావడం లేదు.










2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డ వివాహం గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ అందరు కలిసి వీరి పెళ్లి వేడుకను ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో భారీగా ఖర్చు పెట్టి, రాజస్థాన్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్యల పెళ్లి జరిపించారు. అప్పట్లో వీరి పెళ్లి గురించి దేశవ్యాప్తంగా మీడియా కవరేజ్ చేసింది. నిహారిక పెళ్లి కోసం సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ జంట అన్యోన్యంగా కనిపించింది.
కానీ గత కొంతకాలం నుండి నిహారిక, చైతన్యలు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. వీటి పై మెగా కుటుంబంలోని వారెవరూ స్పందించలేదు. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డకు విడాకులు మంజూరు చేసినట్లు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వెల్లడించింది. ఇదే విషయన్ని నిహారిక, చైతన్య సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
నిహారిక చైతన్యలు ఎందుకు విడిపోయారనే విషయం అయితే బయటికి రాలేదు.