సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలపై సందేశాలు ఇస్తూ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ మారి సెల్వరాజ్. మారి సెల్వరాజ్ గతంలో దర్శకత్వం వహించిన సినిమాలు కూడా సమాజంలో జరిగే కొన్ని సున్నితమైన అంశాల మీద ఉంటాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా మామన్నన్. తమిళ్ లో ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో నాయకుడు పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : నాయకుడు
- నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, వడివేలు.
- నిర్మాత : ఉదయనిధి స్టాలిన్, M. సేన్బగ మూర్తి, R. అర్జున్ దురై
- దర్శకత్వం : మారి సెల్వరాజ్
- సంగీతం : ఏఆర్ రెహమాన్
- విడుదల తేదీ : జులై 14, 2023.

స్టోరీ :
కథ విషయానికి వస్తే రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) అనే ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, కొన్ని కారణాల వల్ల తన తండ్రి తిమ్మరాజు (వడివేలు) తో మాట్లాడడు. తిమ్మరాజు ఎమ్మెల్యేగా ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి గెలుస్తాడు. రఘువీరాతో పాటు కలిసి చదువుకున్న లీల (కీర్తి సురేష్) పేద విద్యార్థులకు చదువు అందిస్తూ ఉంటుంది. దాని కోసం ఒక ఇన్స్టిట్యూట్ కూడా మొదలు పెడుతుంది. రఘువీరా, లీల చదువుకునేటప్పటి నుండి ప్రేమించుకున్నా కూడా ఒకరిపై ఉన్న ఇష్టాన్ని మరొకరు తెలుపరు. కనీసం మాట్లాడుకోరు.

అయితే లీల పెట్టిన ఇన్స్టిట్యూట్ కి సమస్యలు రావడంతో తిమ్మరాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ని లీలాకి ఇన్స్టిట్యూట్ కోసం వాడుకోమని ఇచ్చేస్తాడు. అయితే తిమ్మరాజు పార్టీకి చెందిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్), తన అన్నతో కలిసి ఈ ఇన్స్టిట్యూట్ మీద దాడి చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రఘువీరా, తిమ్మరాజు మాట్లాడుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? రత్నవేలు ఏం చేశాడు? వీటన్నిటినీ రఘువీరా ఎలా ఆపుతాడు? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా వడివేలు అంటే అందరికీ గుర్తొచ్చేది కామెడీ. వడివేలు తెలుగు సినిమాల్లో నటించకపోయినా కూడా చాలా డబ్బింగ్ సినిమాలో ఆయన కామెడీ చూసినవారు ఆయనకి అభిమానులు అయ్యారు. అలాంటి వడివేలు ఈ సినిమాలో ఒక సీరియస్ పాత్ర పోషించారు. గత రెండు సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి మారి సెల్వరాజ్ చూపించారు.

ఈ సినిమా మొత్తం కూడా పాత్రల్లో నటించే నటీనటులకి కాకుండా కథకి ప్రాముఖ్యత ఇస్తూ నడుస్తుంది. హీరో, విలన్ పాత్రలని సమానంగా చూపించే సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. చాలా చోట్ల హీరోని గొప్ప చేయడానికి విలన్ ని తక్కువ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో మాత్రం ఇద్దరినీ సమానంగా చూపించారు. వీరిద్దరితో పాటు వడివేలు పాత్రని కూడా హైలైట్ చేశారు. అసలు సినిమా మొత్తానికి వడివేలు పాత్ర చాలా పెద్ద హైలైట్ అయ్యింది.

సినిమాలో మాట్లాడుకోవడం కంటే ఎక్స్ప్రెషన్స్ తోనే ఎక్కువ సీన్స్ ఉంటాయి. చాలా బరువైన సీన్స్ కూడా తక్కువ డైలాగ్స్ తో ఎక్కువ యాక్షన్ తో ఉంటాయి. ఒక రకంగా ఈ సినిమాకి అదే ఒక ప్లస్ కూడా అయ్యింది. ఎందుకంటే సాధారణంగా మెసేజ్ ఉన్న సినిమాలు అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలా కాకుండా ఎక్స్ప్రెషన్స్ తో ఎక్కువ చెప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా ఆల్రెడీ నిరూపించుకున్న నటులు.

వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా ఇంత మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి నిర్మాతగా కూడా మారడం అనేది అభినందించాల్సిన దగ్గ విషయం. కీర్తి సురేష్ తన పాత్రకి తగ్గట్టుగా చేశారు. ఇంక రత్నవేలు పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ పాత్ర తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్రకి కొత్తదనం తీసుకురావడానికి ఫహాద్ ఫాజిల్ నటించిన విధానం చాలా బాగున్నాయి. సినిమాలో షాట్స్ చూపించిన విధానం కూడా చాలా బాగుంది.

కొన్నిచోట్ల బ్యాక్ గ్రౌండ్ లో కూడా బుద్ధుడు బొమ్మలని చూపించడంలాంటివి చేస్తారు, చిన్న చిన్న విషయాలపై కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇంక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పాటలు కూడా సినిమాని మరొక లెవెల్ కి తీసుకెళ్లే లాగా ఉన్నాయి. పాటల్లో కూడా సినిమాకి సంబంధించిన కథని చెప్పడానికి ప్రయత్నించారు. దాంతో పాటలు సినిమా ఫీల్ ని తగ్గించకుండా సినిమా ఫ్లోలోనే వెళ్ళిపోతాయి. అయితే ఇలాంటి సినిమాలు కొంచెం స్లో పేస్ లో నడుస్తాయి. దాంతో కొన్ని చోట్ల కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ
- టేకింగ్
- నటీనటుల పర్ఫార్మెన్స్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- ల్యాగ్ అనిపించే కొన్ని సీన్స్
- స్లోగా నడిచే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలని సహజంగా చూపిస్తే ప్రేక్షకులు ఏ భాషలో అయినా సరే ఆదరిస్తారు. సినిమా ఇప్పటికే తమిళ్ లో చాలా పెద్ద హిట్ అయ్యింది. స్లోగా ఉన్నా సరే కంటెంట్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి నాయకుడు సినిమా ఒక మంచి బలమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :















పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉందో, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంలో క్లైమాక్స్ ముఖ్యమైన పాత్రను పోషించింది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న బ్రో మూవీలో కూడా అత్తారింటికి దారేది మూవీ వంటి ఎమోషనల్ క్లైమాక్స్ ను త్రివిక్రమ్ పెట్టినట్టు తెలుస్తోంది. బ్రో మూవీ క్లైమాక్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ ఉంటుందని సమాచారం. 2023 లో బ్రో మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే బ్రో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్రో మూవీకి అఖండ మూవీ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఊహించుకోవద్దని ఫ్యాన్స్ కు ఇంటర్వ్యూలలో ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. ఇక బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్రో మూవీతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు ఇప్పటిదాకా ఆరు మిలియన్ల వ్యూస్ లభించాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ ముక్కోణపు ప్రేమకథ విజయం సాధిస్తుందని మూవీ యూనిట్, ట్రైలర్ ను చూసిన ఆడియెన్స్ భావిస్తున్నారు.
ఈ వీడియో చివర్లో ‘అమ్మాయిలు మనం ప్రేమించేటపుడు ఆధార కార్డ్ లో ఫోటోలా ఉంటారు. అదే మనం వదిలేసిన తరువాత ఇన్ స్టాగ్రామ్ లో మోడెల్స్ లా ఉంటారు’ అని చెప్తాడు. బేబీ ట్రైలర్ లో కూడా హీరోయిన్ ముందు డార్క్ మేకప్ లో ఉంటుంది. కాలేజీలో జాయిన్ అయిన తరువాత ఆమెలో మార్పు వస్తుంది. ఇది చూసిన నెటిజెన్లు “బేబీ” గురించి షణ్ణు అప్పుడే చెప్పేసాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వినోదయ సిత్తం తమిళ మూవీలో ప్రధాన పాత్రలో తంబిరాయమ్య నటించారు. కీలక పాత్రలో సముద్రఖని నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, పరశురామ్ (తంబిరామయ్య) ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా 25 సంవత్సరాలుగా పనిచేస్తుంటాడు. అతను టైమ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అన్ని విషయాలను టైమ్ ప్రకారం చేస్తుంటాడు. భార్య, ఇద్దరు కూతుర్లు పరశురామ్ మాటను జవదాటరు. అతని కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంటాడు.
ఇక ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని పాత్రని పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని టాక్. ప్రధాన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఆ మూవీలో తంబిరాయమ్యకు ఇద్దరు అమ్మాయిలు, కొడుకు ఉంటారు. అంటే తెలుగు రీమేక్ లో కథలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుంది.
సమంత ప్రస్తుతం ఖుషి మూవీ మరియు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ రెండింటి చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. సమంత తన హెల్త్ గురించి ఓ సంవత్సరం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని భావించిందని కొన్నిరోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె నటించిన ఖుషి మూవీ సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.
ఖుషి నుండి రిలీజ్ అయిన ‘ఆరాధ్య’ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే సమయంలో ఆ పాటలోని ఒక సీన్ సమంత పై ట్రోలింగ్ కారణం అయ్యింది. ఈ పాటలో ఓ సీన్ లో విజయ్ దేవరకొండ తన కాలితో సమంత కుడి చేతి పై తాకినట్లుగా ఒక స్టిల్ ఉంది. ఈ స్టిల్ ను చూసిన కొందరు నెటిజన్స్, సమంత గతంలో ఒక మూవీ పై చేసిన ఓల్డ్ ట్వీట్ ని ఇప్పుడు బయటికి తీశారు.
ఆ ట్వీట్ లో సమంత ‘ఇంకా విడుదల కానీ ఓ మూవీ పోస్టర్ చూశాను. నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ పోస్టర్ మహేష్ బాబు నటించిన ‘నేనొక్కడినే’ మూవీ పోస్టర్ అని అప్పట్లో చాలామంది అన్నారు. అపుడు గుర్తు వచ్చింది నీకు, మరి నీ మూవీ టైమ్ కి గుర్తు రాలేదా అంటూ నేనొక్కడినే పోస్టర్ ని, ఖుషి ఫొటోని కూడా పక్కపక్కన పెట్టి మరి నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.